Begin typing your search above and press return to search.

రైడర్ శర్వా.. సన్ రైజ్ టైమ్ లో అలా..

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఆ మూవీ.. ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ అందుకుంది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 5:50 AM GMT
రైడర్ శర్వా.. సన్ రైజ్ టైమ్ లో అలా..
X

టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన యాక్టింగ్ తో అలరిస్తున్నారు. వరుస చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా మనమే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఆ మూవీ.. ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ అందుకుంది.


ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను చేస్తున్నారు శర్వా. సామజవరగమన మూవీతో భారీ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. దాంతోపాటు లూజర్ వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి తో తన 36వ చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ గా రూపొందుతున్న ఆ సినిమాలో శర్వానంద్.. ఓ బైక్ రైడర్ గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే రిలీజైన పోస్టర్ల ద్వారా క్లారిటీ వచ్చేసింది.

అయితే తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి విషెస్ తెలిపారు. "జీవితంలోని ప్రతి సాహసయాత్రలో అడ్డంకులను తొలగించాలని ప్రార్థిద్దాం. Sharwa36 టీమ్ తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరుగుతోంది" అని మేకర్స్ ట్వీట్ చేశారు. రైడ్ కు వెళ్లిన శర్వానంద్.. మార్నింగ్ సన్ రైజ్ సమయంలో సేద తీరుతున్నట్లు పోస్టర్ లో చూపించారు.

సూపర్ నేచురల్ బ్యాక్ గ్రౌండ్ తో పోస్టర్ అదిరిపోయిందనే చెప్పాలి. దీంతో శర్వా ఫ్యాన్స్ పోస్టర్ ను చూసి ఖుషీ అవుతున్నారు. సినిమాపై అంచనాలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ పై రన్ రాజా రన్, ఎక్స్‌ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శర్వా.

అయితే Sharwa36 మూవీ షూటింగ్ ను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. కొద్ది రోజుల క్రితం.. ఇండోనేషియా రాజ‌ధాని జ‌క‌ర్తాలో షూటింగ్ నిర్వహించారు. జ‌కార్తా ట్రాక్ లో శ‌ర్వానంద్ పై బైక్ రేసింగ్ యాక్ష‌న్ సీన్స్ ను షూట్ చేసినట్లు అప్పుడు పోస్టర్ రిలీజ్ చేసి చెప్పారు. దిలీప్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో చిత్రీకరణ జరిగినట్లు వెల్లడించారు. మరి శర్వానంద్, అభిలాష్ రెడ్డి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలా ఉంటుందో వేచి చూడాలి.