Begin typing your search above and press return to search.

ప్రభాస్ పై కామెంట్స్.. 'మా' లెటర్.. వార్సీకి శర్వా కౌంటర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   23 Aug 2024 8:33 AM GMT
ప్రభాస్ పై కామెంట్స్.. మా లెటర్.. వార్సీకి శర్వా కౌంటర్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. టాలీవుడ్ కు చెందిన అనేక మంది నటీనటులు.. వార్సీకి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎప్పటికీ కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఇండియన్ హీరోల క్రేజ్ పెరుగుతున్నందుకే ఓర్వలేక కామెంట్స్ చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.


తాజాగా వార్సీ వ్యాఖ్యల వివాదంపై టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేరు ఎత్తకుండానే వార్సీకి సింగిల్ లైన్ తో కౌంటర్ ఇచ్చారు. ఓ యాక్టర్.. మరో యాక్టర్ ను విమర్శించడం నైతికత కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుతిమెత్తగా శర్వా మంచి కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు చెబుతున్నారు.

అయితే ప్రభాస్, శర్వానంద్ మంచి స్నేహితులు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఓ ఫ్రెండ్ గా, తోటి నటుడిగా ప్రభాస్ ను విమర్శించినందుకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు శర్వా. మరోవైపు MAA ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు.. CINETAA(సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముంబై) ప్రెసిడెంట్ పూనమ్ ధిల్లాన్‌ కు లేఖ రాశారు. అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు విష్ణు.

"ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ కల్కి సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ హక్కును మేం గౌరవిస్తాం. కానీ ప్రభాస్ పై ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. అవి బాధపడేలా చేశాయి. వార్సీ వ్యాఖ్యల వల్ల తెలుగు సినీ అభిమానుల్లో చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతీ విషయం స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి సెలబ్రిటీలు తమ మాటల విషయంలో జాగ్రత్త వహించాలి" అని చెప్పారు.

"అయితే మాటలకు మంచి శక్తి ఉంది. అవి బంధాలను నిర్మించగలవు. చీలకులను కూడా సృష్టించగలవు. వార్సీ వ్యాఖ్యలు దురదృష్టవశాత్తు మూవీ లవర్స్ లో అనవసరమైన నెగిటివిటీ క్రియేట్ చేసింది. అర్షద్ వార్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోరుతున్నాం. నటులు ప్రాంతీయ బేధం లేకుండా గౌరవించుకోవాలి. మనమందరం ఒక పెద్ద కుటుంబంలో భాగమని గుర్తుంచుకోవాలి "అని లేఖలో పేర్కొన్నారు మంచు విష్ణు. ఏదేమైనా అర్షద్ చేసిన వ్యాఖ్యల విషయంలో టాలీవుడ్ గట్టిగానే స్పందిస్తుందనే చెప్పాలి.