Begin typing your search above and press return to search.

శర్వా విడాకుల గోల..

టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించబడకపోయినా, "రేస్ రాజా" అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

By:  Tupaki Desk   |   13 Aug 2024 4:34 PM GMT
శర్వా విడాకుల గోల..
X

టాలెంటెడ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా "మనమే" సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు మూడు ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలలో ఒకటి "రేస్ రాజా," ఇది బైక్ రైడర్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా, మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించబడకపోయినా, "రేస్ రాజా" అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

గతంలో రన్ రాజా రన్ - ఎక్స్ ప్రెస్ రాజా టైటిల్స్ తో సాలీడ్ హిట్ కొట్టిన శర్వానంద్ ఈసారి కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. రేస్ రాజా టైటిల్ పై త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ రానుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కాకుండా, శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఇంతకు ముందు "సామజవరగమనా"తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన కథ విశేషాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. "సామజవరగమనా"లో మెయిన్ లీడ్ మధ్య రొమాంటిక్ ట్విస్టుతో సాగే కథా గాథతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ అబ్బరాజు, ఇప్పుడు శర్వానంద్ కోసం మరో ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి రామ్ అబ్బరాజు విడాకులు అనే కాన్సెప్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ కథ విడాకులు, కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇక్కడ "విడాకులు" అనే పాయింట్ పాతదే అయినప్పటికీ, దానిని కొత్త కోణంలో చూపిస్తూ, ఫ్రెష్ కాన్సెప్ట్‌తో కథను మలచినట్లు తెలిసింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రేక్షకులు పెద్దగా చూడని కాన్సెప్ట్‌తో, విభిన్నమైన కథనంతో వస్తున్న ఈ చిత్రం పై శర్వానంద్ అభిమానులు కూడా పెద్దగా అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు, విభిన్నమైన కథలను ఎంచుకునే హీరోగా శర్వానంద్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటూ ఉంటున్నాడు. మరి రాబోయే సినిమాలు కూడా తాను నటించిన గత చిత్రాల్లానే ప్రేక్షకులను అలరిస్తాయేమో చూడాలి.