Begin typing your search above and press return to search.

చరణ్‌, ప్రభాస్‌ మొదటి ప్రాధాన్యత ఎవరికి..?

ఆ సమయంలో కార్తికేయ ఒక సందర్భంగా శర్వానంద్‌ ను.. రామ్‌ చరణ్ అన్న, ప్రభాస్ అన్న లు ఒకే సారి ఫోన్‌ చేసి కలుద్దాం అంటే ముందు ఎవరిని కలుస్తారు అంటూ అడిగాడు.

By:  Tupaki Desk   |   30 May 2024 5:57 AM GMT
చరణ్‌, ప్రభాస్‌ మొదటి ప్రాధాన్యత ఎవరికి..?
X

టాలీవుడ్‌ యంగ్ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో శర్వానంద్‌ కి మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ అత్యంత ఆప్త మిత్రుడు అనే విషయం తెల్సిందే. ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచే ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వీరిద్దరికి కామన్‌ స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు.

శర్వానంద్‌ కి రామ్‌ చరణ్‌ తో పాటు ప్రభాస్ కూడా చాల మంచి మిత్రుడు అనే విషయం తెల్సిందే. వంశీ, ప్రమోద్‌ లతో పాటు ప్రభాస్ తో శర్వానంద్ చాలా సన్నిహితంగా ఉంటాడు. అయితే రామ్‌ చరణ్‌, ప్రభాస్ ల్లో శర్వానంద్‌ కు అత్యంత సన్నిహితుడు ఎవరు అనే విషయమై తాజా ఈవెంట్‌ లో స్పష్టత వచ్చిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

కార్తికేయ హీరోగా ఈశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌ గా రూపొందిన చిత్రం 'భజే వాయు వేగం'. ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను హైదరాబాద్‌ లో నిర్వహించారు. శర్వానంద్‌ ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్‌ లో పాల్గొన్నారు.

ఆ సమయంలో కార్తికేయ ఒక సందర్భంగా శర్వానంద్‌ ను.. రామ్‌ చరణ్ అన్న, ప్రభాస్ అన్న లు ఒకే సారి ఫోన్‌ చేసి కలుద్దాం అంటే ముందు ఎవరిని కలుస్తారు అంటూ అడిగాడు. అందుకు శర్వానంద్‌ స్పందిస్తూ మొదట చరణ్ ను కలుస్తాను అన్నాడు. ఆ తర్వాత ప్రభాస్ అన్నను కలుస్తాను అన్నాడు.

ఇక క్రికెటర్స్ లో కోహ్లీ అంటే చాలా ఇష్టం అని శర్వా చెప్పుకొచ్చాడు. ఒక వేళ రోహిత్‌ శర్మ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే నటిస్తారా అంటూ శర్వానంద్‌ కి ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో తనకు క్రికెట్‌ ఆడటం రాదు. కనుక నేను బయోపిక్ లో నటించను అంటూ శర్వా క్లారిటీ ఇచ్చాడు.