Begin typing your search above and press return to search.

శ‌ర్వానంద్ కి జోడీగా ఆ బ్యూటీనా!

దీన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో శ‌ర్వాకి జోడీగా రెబా మోనికాజాన్ ని ఎంపిక చేసిన ట్లు స‌మాచారం. ప‌లువురు కొత్త భామ‌ల్ని ప‌రిశీలించి తుదిగా రెబాని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 6:23 AM GMT
శ‌ర్వానంద్ కి జోడీగా ఆ బ్యూటీనా!
X

గ‌తేడాది శ‌ర్వానంద్ ఒక్క చిత్రంతోనూ ప్రేక్ష‌కుల ముందుకు రాని సంగ‌తి తెలిసిందే. పెళ్లి ప‌నులు..క‌మిట్ అయిన ఒక్క సినిమా ప‌నుల్లోనే నిమ‌గ్న‌మ‌య్యాడు. దీంతో 2023 లో ఒక్క సినిమా తో కూడా ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌లేక‌పోయాడు. అయితే కొత్త ఏడాదిలో మాత్రం వ‌రుస ప్రాజెక్ట్ లు షురూ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ 35వ సినిమా సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

గ‌త ఏడాది నుంచి సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో కొత్త ఏడాదిలో మాత్రం ఒకేసారి ఏకంగా మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. శ్రీరామ్ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో కొత్త సినిమాల్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. 'మ్యాడ్' తో విజ‌యం అందుకున్న యువ ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వా 36వ సినిమా చేయ‌నున్నాడు.

దీన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో శ‌ర్వాకి జోడీగా రెబా మోనికాజాన్ ని ఎంపిక చేసిన ట్లు స‌మాచారం. ప‌లువురు కొత్త భామ‌ల్ని ప‌రిశీలించి తుదిగా రెబాని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రెబా గ‌త ఏడాది 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. అందం.. అభినయంతో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో శ‌ర్వాకి జోడీగా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

అలాగే రామ్ అబ్బ‌రాజ్ ద‌ర్శ‌కత్వంలోనూ శ‌ర్వా ఓ సినిమాకి ఒకే చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే క‌థ వినిపించిన రామ్ అబ్బ‌రాజ్ స్టోరీతో మెప్పించిన‌ట్లు తెలుస్తోంది. 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' చిత్రాన్ని తెర‌కెక్కించి కూడా రామ్ అబ్బార‌జ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి అబ్బ‌రాజ్ త‌న హిట్ హీరోయిన్ అందులోనూ ఛాన్స్ ఇస్తాడా? అన్న‌ది చూడాలి. వీట‌న్నింటిని శర్వా ఇదే పూర్తి చేసి రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.