Begin typing your search above and press return to search.

ఆ హీరో ఖాతాలో సాలిడ్ హిట్ పడాల్సిందే..!

2022 లో ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు చేసిన శర్వానంద్ ఆ రెండు సినిమాలతో కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 3:51 AM GMT
ఆ హీరో ఖాతాలో సాలిడ్ హిట్ పడాల్సిందే..!
X

2022 లో ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు చేసిన శర్వానంద్ ఆ రెండు సినిమాలతో కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. యువ హీరోల్లో డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్న శర్వానంద్ 2017లో వచ్చిన మహానుభావుడు తర్వాత ఒక్క హిట్టు కొట్టలేదు. మధ్యలో క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు చేసినా కూడా ఏది వర్క్ అవుట్ కాలేదు. అందుకే రెండేళ్లు వెయిట్ చేసి మనమే సినిమాతో వస్తున్నాడు శర్వానంద్.

శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మనమే ప్రచార చిత్రాలు చూస్తే శర్వానంద్ మార్క్ ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తుందని అనిపిస్తుంది. ఈ సినిమాలో ఉప్పన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో శర్వానంద్, కృతి ఇద్దరు ఒక బాబుకి పేరెంట్స్ గా కనిపిస్తున్నారు.

లవ్ లైఫ్ వరకు జీవితం హ్యాపీగా ఉంటుంది. పెళ్లి తర్వాతే అసలు కథ మొదలువుతుంది. ఈ కాన్సెప్ట్ తోనే వస్తున్న సినిమా మనమే. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. కొన్నాళ్లుగా కెరీర్ లో సరైన సక్సెస్ లు లేని శర్వానంద్ ఈసారి సాలిడ్ హిట్ కొట్టాల్సిందే అని అంటున్నారు. మిగతా యువ హీరోలంతా కూడా తమ మార్క్ సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. వారితో పాటు శర్వానంద్ కూడా కెరీర్ లో పరిగెత్తాల్సి ఉంది.

భలే మంచి రోజు సినిమాతో సక్సెస్ అందుకున్న శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ పై శర్వానంద్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఫారిన్ లొకేషన్ లోనే తీసినట్టు కనిపిస్తుంది. శర్వానంద్ ఖాతాలో మనమే ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమా అవుతుందా లేదా అన్నది చూడాలి. జూన్ 7న రిలీజ్ లాక్ చేసిన ఈ సినిమా ట్రైలర్ శనివారం రాం చరణ్ రిలీజ్ చేయనున్నారు.

పక్కింటి అబ్బాయి ఇమేజ్ తో ప్రతి కథకు.. పాత్రకు న్యాయం చేస్తూ వస్తున్న శర్వానంద్ తప్పకుండా ఫ్యూచర్ లో పెద్ద సక్సెస్ లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. శర్వానంద్ సినిమాల్లో మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. మరి మనమే తో శర్వానంద్ ఆశలు ఫలిస్తాయా లేదా అన్నది చూడాలి.