Begin typing your search above and press return to search.

నాగశౌర్య లవ్లీ జోడి.. లవ్లీ మూమెంట్!

ఇక ఈ ఆనంద సమయంలో నాగశౌర్య స్నేహితులు కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఫాలోవర్స్ కూడా వారికి విశేస్ అందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 12:24 PM GMT
నాగశౌర్య లవ్లీ జోడి.. లవ్లీ మూమెంట్!
X

నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ హీరో నాగశౌర్య విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ సక్సెస్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అతనికి అనుకున్నంతగా సక్సెస్ లు లేకపోయినప్పటికీ డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నడు. నాగశౌర్య ఒక మంచి కథానాయకుడిగానే కాకుండా మంచి ఫ్యామిలీ మ్యాన్ గా కూడా క్రేజ్ అందుకుంటున్నాడు. గత ఏడాది అతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అనూష అనే అమ్మాయిని ప్రేమించిన నాగశౌర్య కుటుంబ సభ్యుల సమక్షంలో 2022 నవంబర్ 20న బెంగుళూరులో పెళ్లి చేసుకున్నాడు. ఇక చూడముచ్చటగా ఉండే ఈ జంట ఒక లవ్లీ వీడియోతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి రోజు సందర్భంగా మూమెంట్స్ ను ఎంజాయ్ చేసిన నాగ శౌర్య అదే ఆనంద సమయంలో భార్య అనూష తో కలిసి కేక్ కట్ చేశాడు.

ఇక ఈ ఆనంద సమయంలో నాగశౌర్య స్నేహితులు కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఫాలోవర్స్ కూడా వారికి విశేస్ అందిస్తున్నారు. ఇక ఈ మనోహరమైన జంట అనేక చిరునవ్వులతో తమ ప్రయాణాన్ని కొనసాగించాలని మరియు ఆనందం మరియు లెక్కలేనన్ని పంచుకున్న జ్ఞాపకాలతో అలంకరించబడాలని మరికొందరు నెటిజన్లు కోరుకుంటున్నారు.

శౌర్య భార్య ఆర్కిటెక్ట్ మరియు ఇంటీరియర్ డిజైనర్. ఆమె బెంగళూరుకు చెందిన అమ్మాయి. ఇక నాగ శౌర్య కెరీర్ విషయానికి వస్తే.. మొదట్లో ఊహలు గుసగుసలాడే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. అనంతరం చలో లాంటి బాక్సాఫీస్ హిట్ కూడా చూశాడు. అయితే ఆ తరువాత నాగశౌర్య కు మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ పడలేదు.

విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కానీ ఏది వర్కౌట్ కావడం లేదు. వరుడు కావలెను, లక్ష్య, కృష్ణ వృంద విహారి, పలానా అబ్బాయి పలానా అమ్మాయి, రంగబలి.. ఇలా వరుసగా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నాగశౌర్య కు సరైన సక్సెస్ అయితే దక్కలేదు. మరి రాబోయే సినిమాలతో అతను ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.