30 లక్షల జీతం తీసుకుని కుంద్రాను మోసం చేసింది!
కుంద్రా నుండి 30 లక్షల రూపాయల భారీ జీతం అందుకున్నప్పటికీ షెర్లిన్ చోప్రా అతడికి వ్యతిరేకంగా మారిందని పేర్కొంది.
By: Tupaki Desk | 11 April 2024 4:35 AM GMTరాజ్ కుంద్రా నీలి చిత్రాల యాప్‌ల కేసు అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇరుక్కున్న నటి గెహానా వసిష్ఠ్ ఇటీవల భోపాల్‌లో వృత్తిపరమైన కమిట్‌మెంట్‌లను పూర్తి చేసి.. అక్కడ ఉన్న సమయంలో మీడియాతో ముచ్చటిస్తూ.. తనపైనా, రాజ్ కుంద్రాపైనా వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా షెర్లిన్ చోప్రా ద్రోహం చేసిందని ఆరోపించారు గెహనా. కుంద్రా నుండి 30 లక్షల రూపాయల భారీ జీతం అందుకున్నప్పటికీ షెర్లిన్ చోప్రా అతడికి వ్యతిరేకంగా మారిందని పేర్కొంది.
తన నిర్దోషిత్వాన్ని నొక్కి చెబుతూ.. గెహానా తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించే సాక్ష్యాలు లేకపోవడాన్ని నొక్కిచెప్పారు. తనను ఉద్దేశించిన అడల్ట్ వీడియోలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో బోల్డ్ షోలలో తన ప్రమేయాన్ని అంగీకరిస్తూనే తాను శృంగారం, అశ్లీలత మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఎత్తి చూపింది. తనను తాను `రొమాంటిక్ ఐశ్వర్య రాయ్` అని కామిక్ గా వర్ణించుకుంది.
కుంద్రాపై షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, వివాదాస్పద షెర్లిన్ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని సూచిస్తూ చోప్రా -కుంద్రా మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను గెహానా ఎత్తి చూపారు. తనపై పరువు నష్టం దావా వేయాలని అన్నారు. ఆదర్శ్ నగర్‌కు చెందిన వ్యక్తులు షెర్లిన్ చోప్రా ఫోటోలను దుర్మార్గపు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని కూడా అన్నారు.
2021లో అశ్లీల రాకెట్ కేసులో గెహానా చిక్కుకుంది. జైలుకు వెళ్లింది. వయోజన శృంగార వీడియోల చిత్రీకరణలో పాల్గొనడానికి ఆర్థిక ప్రోత్సాహకాలతో యువతులను బలవంతం చేసిందని గెహనాపై ఆరోపణలు వచ్చాయి. గెహనా ప్రకటనలు.. సినీపరిశ్రమలో వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, లైంగిక దోపిడీ ద్రోహం వంటి విషయాలను బహిర్గతం చేస్తున్నాయి.