Begin typing your search above and press return to search.

బొంబాయిలో అడుగుపెట్టిన రోజే స్టార్ అవుతాడ‌ని తెలుసు

అత‌డు బొంబాయిలో అడుగుపెట్టిన‌ప్పుడే స్టార్ అవుతాన‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ని ఆమె అన్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 3:10 PM GMT
బొంబాయిలో అడుగుపెట్టిన రోజే స్టార్ అవుతాడ‌ని తెలుసు
X

''బొంబాయిలోకి అడుగుపెట్టిన రోజే, తాను మంచి స్టార్ అవుతానని అత‌డికి తెలుసు. అతడు తన సొంత శ‌రతుల ప్రకారం నడుచుకున్నాడు.. కోరుకున్నవన్నీ పొందాడు'' అంటూ కింగ్ ఖాన్ షారూఖ్ గురించి తాను స్వ‌యంగా చూసిన‌వ‌న్నీ చెప్పుకొచ్చారు సీనియ‌ర్ న‌టి షీబా ఆకాష్ దీప్. అత‌డు బొంబాయిలో అడుగుపెట్టిన‌ప్పుడే స్టార్ అవుతాన‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ని ఆమె అన్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ స‌మ‌కాలికురాలు, సీనియ‌ర్ నటి షీబా ఆకాష్‌దీప్ చివరి రెండు ప్రాజెక్టులు రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ (2023), జిగ్రా (2024) థియేటర్లలోకి వ‌చ్చాయి.

తాజా ఇంట‌ర్వ్యూలో షారుఖ్ ఖాన్‌ను సూపర్‌స్టార్‌గా ఎద‌గ‌డానికి అత‌డిలో ఉన్న ప్ర‌త్యేక ల‌క్ష‌ణాల గురించి షీబా ప్రస్తావించారు. ఖాన్ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి నిద్రలేని రాత్రులు ఎలా గడిపేవాడో వెల్లడించింది. షీబా మాట్లాడుతూ-''అత‌డిని ఇప్ప‌టికీ క‌లిసిన‌ప్పుడు ఎదుటివ్య‌క్తికి ఎంతో గౌర‌వ‌మిస్తాడు. గౌర‌వం ఇవ్వ‌డం తిరిగి తీసుకోవ‌డం తెలిసిన న‌టుడు. గది లోప‌లి నుంచే చూస్తాడు. తానుగానే వచ్చి మ‌న‌ల్ని కలుస్తాడు. ఇప్ప‌టికీ అతడు నన్ను కలిసినప్పుడు, చాలా ప్రేమ, ఆప్యాయత.. గౌరవంతో ఉంటాడు. మ‌నం అతడిని ఆరాధించకుండా ఉండలేం. త‌నవారితో ఎప్పుడూ మ‌న‌స్ఫూర్తిగా ఉంటాడు. చాలా మంచి పెద్దమనిషి.. చాలా మంచి మనిషి'' అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. షారూఖ్ ఒక న‌టుడిగా, నిర్మాత‌గా తన బెస్ట్ ఇవ్వాలని ఆశిస్తాడు... అతడు అనుకున్న‌ది సాధించే వరకు నిద్రపోడు అని షీబా తెలిపారు.

షారుఖ్ ఖాన్‌లో ఎప్పుడూ చిన్నపిల్లల ఉత్సాహం ఉంటుందని కూడా షీబా అన్నారు. షారుఖ్ ఖాన్ 2023లో పఠాన్, జవాన్, డంకీ అనే మూడు విడుదలలతో బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించాడు. తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి కింగ్‌లో షారూఖ్ న‌టిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.