Begin typing your search above and press return to search.

పుష్ప-2లో ఆమె.. మూడో పార్టులో కూడా!

కొన్ని నెలల క్రితం నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో మరికొద్ది రోజుల్లో సందడి చేయనుంది.

By:  Tupaki Desk   |   24 March 2024 2:45 AM GMT
పుష్ప-2లో ఆమె.. మూడో పార్టులో కూడా!
X

ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ అంటూ ఒక్కసారిగా అందరినీ షేక్ చేసి పడేసింది స్టార్ హీరోయిన్ సమంత. పుష్ప మూవీలోని ఈ సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సామ్ వల్లే ఆ పాటకు అంత క్రేజ్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సమంత ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులు వేరే లెవెల్. ఇక సమంత.. కొద్ది నెలలుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఖుషీ మూవీ తర్వాత ఫుల్ రెస్ట్ తీసుకుంది.


ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. కొన్ని నెలల క్రితం నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో మరికొద్ది రోజుల్లో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రమోషన్లను కూడా స్టార్ట్ చేసింది సామ్. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

ఇదంతా పక్కన పెడితే.. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటైన పుష్ప-2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యి చకచకా పనులు పూర్తి చేస్తున్నారు మేకర్స్. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ కూడా ఇవ్వనున్నారు. అయితే ఈ మూవీలో సమంత క్యామియో రోల్ లో నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పుష్ప-2లో కూడా సమంత ఐటెం సాంగ్ చేస్తుందంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదని తేలిపోయింది. ఇప్పుడు సామ్.. అతిథి పాత్ర పోషిస్తుందంటున్నారు. సినిమా లాస్ట్ లో చిన్న సాంగ్ బిట్ లేదా పుష్ప 1లో ఆమె రోల్ ను సీక్వెల్ లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఇంకో క్రేజీ టాక్ ఏంటంటే.. పుష్ప మూడో పార్ట్ లో సమంత రోల్ కు మంచి స్కోప్ ఉందట.

కొన్ని రోజుల క్రితం పుష్ప-3 ఉంటుందని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే! పుష్ప ఫ్రాంచైజీలో మరిన్ని భాగాలు వస్తాయని, అయితే వెంటనే ఇది పాజిబుల్ కాదని తెలిపారు. ఇక పుష్ప-2లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఐటెం సాంగ్ చేయనుందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాలి.