గ్లామరస్ చిరంజీవి వెనుక సీక్రెట్ ఆవిడ!
మరి చిరంజీవి లో ఈ బ్యూటీకి కారణం ఎవరు? ఆయన్ని యంగ్ గా మార్చిన సీక్రెట్ ఏంటి? అంటే చాలా సంగతులే ఉన్నాయి.
By: Tupaki Desk | 14 May 2024 2:45 AM GMTవింటేజ్ మెగాస్టార్ చిరంజీవి చూసి అభిమానులెంతో మురిసిపోతున్నారు. 60 దాటినా మెగాస్టార్ గ్రేస్ ఎందులోనూ ఏ మాత్రం తగ్గలేదన్నది అభిమానుల మాట. ఈ మధ్యనే మెగాస్టార్ ఓ వీడియో రిలీజ్ చేసారు. అందులో చిరంజీవిని చూస్తే ఆయన వయసు పెరుగుతుందా? తగ్గుతుందా? అన్నసందేహం రావడం సహజం. పూర్తిగా స్లిమ్ లుక్ లో చిరు ట్రాన్సపర్మేషన్ అదిరిపోయింది. టాప్ టూ బాటమ్ చిరంజీవిలో ఎన్నో రకాల మార్పులొచ్చాయి. మరి చిరంజీవి లో ఈ బ్యూటీకి కారణం ఎవరు? ఆయన్ని యంగ్ గా మార్చిన సీక్రెట్ ఏంటి? అంటే చాలా సంగతులే ఉన్నాయి.
చిరంజీవి డైట్ ప్లాన్ అన్నది ఎంతో పక్కాగా ఉంటుంది. ఉదయాన్నే జిమ్..యోగా...వాకింగ్ లాంటివి తప్పని సరి. శరీరానికి కావాల్సిన పోషకాలు..కాలరీస్ కొలమానంలో తీసుకుంటారు. ఇలా ఎన్నిచేసినా.... హీరోల్నిమనోహారంగా హైలైట్ చేసేది మాత్రం డ్రెస్సింగ్ సెన్స్. ఇది చెప్పగానే వెంటనే చిరంజీవి కుమార్తె సుస్మిత గుర్తొస్తారు. `ఖైదీ నెంబర్ 150` నుంచి చిరు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమె పనిచేస్తున్నారు. ఏసినిమాలో గెటప్ కైనా సుస్మిత డిజైనర్ గా చూసుకుంటున్నారు.
కానీ చిరుని అంత అందంగా చూపించడం వెనుక అసలు కారకురాలు తాను కాదని..ఆయన భార్యసురేఖ అంటూ సుస్మిత ఓ సందర్భంలో రివీల్ చేసారు. చిరంజీవి వేసుకునే బట్టలన్నింటినీ సురేఖ సెలక్ట్ చేస్తారుట. ఆయని ప్పటికీ అంత స్మార్ట్ గా కనిపించడానికి కారణం అమ్మే అంటున్నారు. చిరు బాడీకి ఎలాంటి బట్టలు సూట వుతాయి? అన్నది సురేఖ ఎంపిక చేసినట్లుగా తాను కూడా చూజ్ చేయలేనని తెలిపారు. చాలా కాలంగా ఆవిడే ఆ ఛాన్స్ తీసుకున్నారుట.
ముఖ్యంగా ఆఫ్ ది స్క్రీన్ లో చిరంజీవిని అంత అందంగా చూపించడానికి సురేఖ కారణం అంటున్నారు. అలాగే వాల్తేరు వీరయ్యలో గళ్ల లుంగీ..షర్ట్ ఎలాంటివి సూటవుతాయో అమ్మకే బాగా తెలిసిందని అన్నారు. మొత్తానికి వింటేజ్ మెగాస్టార్ వెనుక ఆయన అర్ధాంగి కీరోల్ పోషిస్తున్నారు? అన్న సంగతి చాలా ఆలస్యంగా తెలిసింది కదా. ఇప్పటి వరకూ సురేఖ మేడంని అంతా ఇల్లు చక్కదిద్దడం కోసమే పరిమితమనుకున్నారు. ఆవిడ కూడా తండ్రి( అల్లు రామలింగయ్య) తగ్గ వారసురాలే.