Begin typing your search above and press return to search.

కొత్త తరానికి క‌మ్ములా విలువైన సూచ‌న‌!

ఇండ‌స్ట్రీ గురించి ఇలాంటి ఆలోచ‌న చేసే వారికి..ముఖ్యంగా కొత్త తరానికి స్టార్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ములా కొన్ని విలువైన సూచ‌న‌లు చేసారు.

By:  Tupaki Desk   |   23 March 2025 11:00 PM IST
కొత్త తరానికి క‌మ్ములా విలువైన సూచ‌న‌!
X

ఫిల్మ్ ఇండ‌స్ట్రీ చుట్టూ తిరిగే డ‌బ్బు ఇంకెక్కాడా తిర‌గ‌లేద‌ని చాలా మంది అనుకుంటారు. డ‌బ్బు సంపాదిం చాలంటే సినిమాల్లోకే వెళ్లాల‌ని కొంత మంది టార్గెట్ గా వ‌స్తుంటారు. ఖ‌రీదైన జీవితం ...కావాల్సినంత స్వేచ్ఛ ఇండ‌స్ట్రీలో దొరుకుతుంద‌ని..ఇక్క‌డ జీవిత‌మే ఎంతో గొప్ప‌గా ఉంటుంద‌న్న‌ది చాలా మంది అభిప్రాయం. ఇండ‌స్ట్రీ గురించి ఇలాంటి ఆలోచ‌న చేసే వారికి..ముఖ్యంగా కొత్త తరానికి స్టార్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ములా కొన్ని విలువైన సూచ‌న‌లు చేసారు.

కొత్త త‌రం పేరు కోస‌మో..డ‌బ్బు కోస‌మే సినిమాల్లోకి రాకూడ‌ద‌న్నారు. అవి కేవలం ఉప‌ఫ‌లాలుగా రావాలి త‌ప్ప వాటినే టార్గెట్ చేసి రావ‌డం క‌రెక్ట్ కాదన్నారు. నిజానికి అలా వ‌చ్చిన వాళ్లు ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అవ్వ‌డం కూడా క‌ష్టం. సినిమాల్లో అవ‌కాశం రావ‌డ‌మే గ‌గ‌నం. ఒక్క ఛాన్స్ కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ప‌రిశ్ర‌మ చుట్టూ తిర‌గాల్సి ఉంటుంది. అలా తిరిగినా వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. సినిమాలంటే ఎంతో ఫ్యాష‌న్ ఉంటే త‌ప్ప ఈ రంగంలో రాణించ‌లేమ‌న్న‌ది గుర్తించాలి.

అలా ఉన్నా? అంద‌రికీ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చెప్ప‌లేం. ప్ర‌తిభ‌తో పాటు అదృష్టం కూడా క‌లిసి వ‌స్తేనే అవ‌కాశాలు వ‌స్తాయ‌న్న‌ది కాద‌న‌లేని నిజం. ఒక్క‌సారి స‌క్సెస్ అయితే ఇండ‌స్ట్రీ పేరు డ‌బ్బు, ప‌ర‌ప‌తి అన్ని ఇస్తాయి. నేడు స‌క్సెస్ అయిన చాలా మంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చిన వాళ్లే. వార‌సులైనా ట్యాలెంట్, ఫ్యాష‌న్ లేక‌పోతే రాణించ‌లేరు అన‌డానికి చాలా మంది ఉదాహ‌ర‌ణ‌ల‌గా ఉన్నారు.

ప్ర‌తిభావంతుల‌కు ఇప్పుడు అవ‌కాశాలు కూడా పెరిగాయి. ఒక‌ప్పుడు సినిమా ఛాన్స్ రావాలంటే ఎన్నో ఫ్యాక్ట‌ర్స్ ఉండేవి. ఇప్పుడు ట్యాలెంట్ అనే ఫ్యాక్ట‌ర్ ఉంటే? ఛాన్స్ ఆల‌స్య‌మైనా వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం స‌క్సెస్ అయిన వాళ్ల‌ను చూస్తుంటే క‌లుగుతుంది. గ‌డిచిన ద‌శాబ్ధంలో చాలా మంది కొత్త వాళ్లు స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.