'లీడర్-2' లీడ్స్...కమ్ములా మళ్లీ కదం తొక్కేలా!
ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ములా మనసు 'లీడర్ -2' పై లాగుతుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 23 March 2025 10:26 AM ISTరానా కథానాయకుడిగా శేఖర్ కమ్ములా తెరకెక్కించిన 'లీడర్' అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. రానా-కమ్ములా కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ మూవీ. రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందన్నది? సాధారణ ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారు. కేవలం కథే బలంగా ఆడిన చిత్రమిది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న గొప్ప చిత్రంగా నిలిచింది. అప్పట్లో రాజకీయ వ్యవస్థలో అవినీతి ఎలా జరుగుతుందన్నది? చట్టం..న్యాయం అనేవి ధనికుడి విషయంలో ఎలా ఉంటుంది? పేద వాళ్ల విషయంలో ఎలా ఉంటుంది? అన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు.
అయితే వాణిజ్య పరంగా అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. అదే 'లీడర్' ఇప్పుడు తీసి ఉంటే? పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తే గొప్ప చిత్రంగా భారతీయ చిత్ర పరిశ్రమలో నిలిచిపోయేది. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ములా మనసు 'లీడర్ -2' పై లాగుతుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కమ్ములా ఓ ఇంటర్వ్యూలో కొన్ని లీడ్స్ కూడా ఇచ్చారు.
'లీడర్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు రైటింగ్ టేబుల్ దగ్గర లక్ష కోట్లు అన్నానని అప్పుడు నన్ను అంతా వింతగా చూసారు. కానీ ఇప్పుడు అదే లక్షకోట్లు అన్నది చాలా చిన్నగా మారిపోయింది. నేటి రాజకీయం మరో పెద్ద ఆటగా మారిపోయిందన్నారు. ఇప్పుడిదే అంశాన్సి స్పృషించాలంటే? ఇంకా అప్ డేట్ గా ఆలోచించి చేయాల్సి ఉంటుందన్నారు. తాను చూసిన ప్రపంచాన్ని విజువల్ మీడియా ద్వారా అందరికీ చూపించా లన్నది తన బలమైన కోరికగా వ్యక్తం చేసారు.
తనకసలు దర్శకుడు అవ్వాలనే ఆలోచనే ఎప్పుడూ ఉండేది కాదన్నారు. సినిమా రంగంలోకి అను కోకుండా వచ్చానన్నారు. నిజంగా శేఖర్ కమ్ములా 'లీడర్ 2 'తీస్తే గనుక పాన్ ఇండియాలో మరో గొప్ప చిత్రం అవుతుంది. ఇలాంటి అటెంప్ట్ లు కొందరు మాత్రమే చేయగలగరు. అందులో కమ్ములా నెంబర్ వన్ లో ఉంటారు.