Begin typing your search above and press return to search.

లైవ్ లో చెప్పుతో కొట్టేవరకు వెళ్లిన లావణ్య వివాదం

కానీ, శేఖర్ భాషా లావణ్యకు సమాధానమిస్తూ, నన్ను చెప్పుతో కొడతావా అంటూ తాను కూడా దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఈ డిబేట్ మరింత ఘర్షణాత్మకంగా మారింది.

By:  Tupaki Desk   |   2 Aug 2024 7:44 AM GMT
లైవ్ లో చెప్పుతో కొట్టేవరకు వెళ్లిన లావణ్య వివాదం
X

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్, లావణ్య మధ్య కొనసాగుతున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెల రోజుల నుంచి ఈ ఇష్యూ తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. రాజ్ తరుణ్ తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని లావణ్య ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇది యధావిధిగా వార్తల్లో మారటంతో, పోలీసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ వివాదం మిడియా వేదికగా డిబేట్స్‌కు దారి తీసింది. ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో లావణ్య, ఆర్జే శేఖర్ భాషా మధ్య జరిగిన డిబేట్ అయితే పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఈ డిబేట్‌లో శేఖర్ భాషా లావణ్యపై సంచలన ఆరోపణలు చేయడం, లావణ్య శేఖర్ భాషాను చెప్పుతో కొట్టడం.. ఇలా చాలా తీవ్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.

డిబేట్‌లో శేఖర్ భాషా చేసిన ఆరోపణలు సీరియస్‌గా మారాయి. ఎందుకంటే లావణ్య చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తోందని, వారికి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చేలా ప్రోత్సహిస్తోందని, ఆ విధంగా వారి జీవితాలను నాశనం చేస్తోందని శేఖర్ భాషా ఆరోపించాడు. ఈ ఆరోపణలపై లావణ్య తీవ్ర ఆగ్రహంతో, డిబేట్‌లో కోపం చెంది, చెప్పుతో శేఖర్ భాషాను కొట్టడం దాంతో ఈ వివాదం మరింత తీవ్రతరమైనది.

డిబేట్ సమయంలో జరిగిన ఈ ఘటన అక్కడ ఉన్న యాంకర్ మరియు మీడియా ప్రతినిధులను కూడా షాక్ కు గురిచేసింది. కానీ, శేఖర్ భాషా లావణ్యకు సమాధానమిస్తూ, నన్ను చెప్పుతో కొడతావా అంటూ తాను కూడా దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఈ డిబేట్ మరింత ఘర్షణాత్మకంగా మారింది. చివరికి, అక్కడున్న వారు ఇద్దరినీ కంట్రోల్ చేస్తూ పరిస్థితిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో, నిజం ఏంటో అర్థం చేసుకోవాల్సి ఉంది. మొన్నటివరకు రాజ్ తరుణ్ ను వదిలేదు లేదని చెప్పిన లావణ్య గత రాత్రి అతను తనకు అవసరం లేదని ట్విస్ట్ ఇచ్చింది. రాజ్ తరుణ్ ఇప్పుడు ఎంత చెప్పినా తనతో ఉండేందుకు ఇష్టపడడం లేదని అనిపిస్తుంది, కానీ మోసం చేసినందుకు తగిన శిక్ష అనుభవిస్తాడు.. అని ఆమె ఆరోపించారు. మరి ఈ విషయంలో పోలీసుల విచారణ, విచారణ ప్రక్రియ ఎలా సాగుతుందో, ఎంతమేరకు సాక్ష్యాలు సమకూరుతాయో చూడాలి.