శేఖర్ కమ్ముల కుబేర.. ఇదెక్కడి తలనొప్పి!
అయితే ఇప్పుడు ఈ మూవీ.. టైటిల్ విషయంలో వివాదంలో చిక్కుకుంది. కుబేర టైటిల్ తమదని, దాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నామని నిర్మాత కర్మికొండ నరేంద్ర మీడియాతో తెలిపారు.
By: Tupaki Desk | 15 April 2024 3:26 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ కుబేర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన జోనర్ నుంచి బయటకు వచ్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇటీవల మహా శివరాత్రి పండుగ కానుకగా విడుదల అయిన ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ గ్లింప్స్ లో ధనుష్ డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. కుబేర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్ లో ధనుష్ ను బిచ్చగాడిగా మేకర్స్ చూపించడంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల బ్యాంకాక్ లో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే ఇప్పుడు ఈ మూవీ.. టైటిల్ విషయంలో వివాదంలో చిక్కుకుంది. కుబేర టైటిల్ తమదని, దాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నామని నిర్మాత కర్మికొండ నరేంద్ర మీడియాతో తెలిపారు. టైటిల్ డూప్లికేషన్ పై తాను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో చేసిన ఫిర్యాదుకు సమాధానం రాలేదని చెప్పారు. దీంతో న్యాయపరమైన ఆశ్రయం పొందానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుని ఇప్పటికైనా ఈ వివాదాన్ని పరిష్కరించాలని నరేంద్ర కోరారు. తాము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ వారు కాపీ కొట్టి ఇటీవల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారని అన్నారు. కుబేర టైటిల్ విషయంలో ఎంతటి న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ మూవీని స్టార్ నటీనటులు, టాప్ టెక్నీషియన్స్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు మేకర్స్. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ టైటిల్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.