ఏమిటి ఈ యాంగిల్స్? ఎక్కడ జూమ్ చేస్తున్నావు?
ఇప్పుడు ఈ బ్యూటీ పబ్లిక్ ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్ల అసహ్యకరమైన ప్రవర్తనపై చిందులు వేయడం చర్చనీయాంశమైంది.
By: Tupaki Desk | 5 April 2024 4:51 PM GMT'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`లో మోతా..` పాటతో మోతెక్కించబోతోంది బిగ్ బాస్ (హిందీ) బ్యూటీ అయేషా ఖాన్. టాలీవుడ్ లో తొలి అడుగుల్లోనే అదిరిపోయే గ్లామర్ తో మతులు చెడగొడుతోంది ఈ బ్యూటీ. ఇటీవల విడుదలైన మోతా లిరికల్ వీడియోలో అయేషా గ్లామర్ షోకి మతులు చెడాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేలో విడదల కానుంది. ఇటీవల విడుదలైన `ఓం భీమ్ బుష్` అనే సినిమాలోను ఈ బ్యూటీ నటించింది. ఈ రెండు సినిమాలతో అయేషా తెలుగు నాటా పాపులరైంది.
ఇప్పుడు ఈ బ్యూటీ పబ్లిక్ ఈవెంట్లలో ఫోటోగ్రాఫర్ల అసహ్యకరమైన ప్రవర్తనపై చిందులు వేయడం చర్చనీయాంశమైంది. ఫోటోగ్రాఫర్ల తీరుతెన్నులను తీవ్రంగా తప్పు పడుతూ అయేషా చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను ప్రకంపనంగా మారాయి. ఇంతకీ అయేషా ఏమంది? అంటే... ఫోటోగ్రాఫర్లు హద్దు మీరి సెలబ్రిటీల ఫోటోలను తీస్తున్నారని, అనుమతి లేకుండా కనీస మర్యాద లేకుండా ఫోటోలు తీస్తున్నారని ఆరోపించారు.
బాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న అగౌరవ ప్రవర్తన గురించి అయేషా ఆరోపించింది. గత ఇంటర్వ్యూలో అవకాశాల పేరుతో దోపిడీ ప్రవర్తన గురించి ధైర్యంగా ఓపెనైన అయేషా.. పరిశ్రమలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేసింది. ఇప్పుడు అయేషా తన దృష్టిని అనుచిత ప్రవర్తనతో విసిగించే స్టిల్ ఫోటోగ్రాఫర్ల పైకి మళ్లించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులతో చెలరేగింది ఈ బ్యూటీ. కొంతమంది ఫోటోగ్రాఫర్‌ల అసహ్యకరమైన ప్రవర్తన, అనుచితమైన కోణాల గురించి ప్రస్థావిస్తూ వారిని తీవ్రంగా నిందించింది. సమ్మతి లేకుండానే ఫోటోలు తీస్తారు అంటూ ప్రాథమిక మర్యాద లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ, అసౌకర్య క్షణాలలో ఫోటోలు తీయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
ఏమిటి ఈ యాంగిల్స్? ఎక్కడ జూమ్ చేస్తున్నావు? అనుమతి అవసరం లేదా? అంటూ ప్రశ్నించింది అయేషా. కొన్ని మీడియా సంస్థల తప్పులను నిలదీసింది. భయపడాల్సిన అవసరం లేకుండా స్త్రీ తనకు నచ్చిన విధంగా దుస్తులు ధరించగలదా? ఎవరు ఏ యాంగిల్‌లో క్లిక్ చేస్తారో దేవుడికి తెలుసు! అంటూ ఆవేదన చెందింది. ఒక మహిళ కారు దిగే ముందు తన దుస్తులను సర్దుకుంటోంది.. మీరు ఆ కచ్చితమైన క్షణాన్ని పట్టుకుని ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయాలనుకుంటున్నారా? ఒక మహిళ నన్ను వెనుక నుండి కెమెరాల్లో బంధించవద్దు అని చెబుతుంది... కానీ ఆగుతారా? అని నిలదీసింది. మీడియా సంస్థలు కొన్ని ప్రాథమిక మర్యాదలను నేర్చుకోవాలని సూచించింది.
మీడియా నుండి గౌరవం కోరే ప్రముఖుల బృందంలో ఆయేషా వాయిస్ చేరింది. అయేషా భయపడక, దాపరికం లేకుండా సూటిగా చేసిన విమర్శలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తెరపైనా తెరవెనకా నటీమణులు ఎదుర్కొంటున్న నిరంతర ఒత్తిడి ఎలాంటిదో అయేషా స్పష్టంగా వివరించారు.