Begin typing your search above and press return to search.

శెట్టిస్ ఖుషి.. కంటెంటే అసలు కింగ్

అయితే ఈ రెండు చిత్రాల్లో ఒకటి ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది.

By:  Tupaki Desk   |   12 Sep 2023 5:44 AM GMT
శెట్టిస్ ఖుషి.. కంటెంటే అసలు కింగ్
X

ఓ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ నెంబర్లను నమోదు చేయాలన్న, ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలి రావాలన్నా కంటెంటే ముఖ్యం. ఎందుకంటే కంటెంటే కింగ్. మంచి కంటెంట్‌ ఉండి.. కథలో సరైన భావోద్వేగాలు పండిస్తే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఇప్పటికే చాలా చిత్రాలు నిరూపించాయి. అదే కథలో పస లేకపోతే అది ఎంత పెద్ద స్టార్ హీరో లేదా హీరోయిన్ సినిమా అయినా నిర్మొహమాటంగా థియేటర్ల నుంచి గెట్ ఔట్ అనేస్తారు.

తాజాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి రెండు చిత్రాలు. అవే ఖుషి-మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఫ్యామిలీ అండ్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ రెండు సినిమాలు వారం గ్యాప్ లో రిలీజైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఖుషి రిలీజ్ అవ్వగా.. సెప్టెంబర్ 7న మిస్ శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు చిత్రాల్లో ఒకటి ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. మరొకటి రోజురోజుకు రెస్పాన్స్ ను పెంచుకుంటూ ముందుకుపోతోంది.

విజయ్ దేవరకొండ-సమంతకు ఉన్న క్రేజ్ కారణంగా ఖుషి సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ కూడా మ్యూజికల్ గా బాగా హిట్ అయ్యాయి. దీంతో ఈ చిత్రంపై మంచి ఆశలే పెట్టుకున్నారు ప్రేక్షకులు. బిజినెస్ కూడా బాగానే జరిగింది.

అందుకే మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ విడుదల తర్వాత ఈ చిత్రం మిక్స్ డ్ రివ్యూసే పరిమితమైంది. ఇక ఈ చిత్ర రిలీజ్ సమయంలో పోటీ ఏమీ లేకపోవడంతో కాస్త కలిసొచ్చింది. దీంతో మొదటి వారం పర్వాలేదనిపించే వసూళ్లను సాధించినా ఆ తర్వాత కథలో బలం లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడంతో వారంలోనే సినిమా చాప చుట్టేసింది. కొన్ని చోట్ల మాత్రమే సినిమా ఆడింది.

ఇకపోతే ఖుషి రిలీజైన వారం తర్వాత మిస్​ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా.. షారుక్ జవాన్ రూపంలో గట్టి పోటిని ఎదుర్కొంది. రిలీజ్ కు ముందు ఈ చిత్రానికి పెద్దగా బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. అంతా జవాన్ ఫీవరే కనిపించింది. అందుకే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఓపెనింగ్స్ దక్కలేదు. కానీ ఆ తర్వాత సినిమా కంటెంట్ బాగుండడంతో, మౌత్ టాక్ కూడా పాజిటివ్ రావడంతో క్రమక్రమంగా వసూళ్లు పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రం రోజురోజుకు రెస్పాన్స్ ను పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

కాబట్టి కంటెంట్ బాగుంటే చాలు ఏ సినిమాను అయినా ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయం మరోసారి రుజువైంది. రిలీజ్ కు ముందు ఎంత భారీగా, డిఫరెంట్ గా ప్రచారాలు చేసినా, ఎంత మంది స్టార్ కాస్ట్ ఉన్నా.. ఫైనల్​ గా కంటెంటే కింగ్ అన్నది నిజమైంది.