Begin typing your search above and press return to search.

రోడ్డుమీద డీజే పాట‌ల‌కి డాన్సు చేసేదాన్ని!

అక్క‌డ భామ‌ల‌తో ఎలా పోటీ ప‌డాలో? ప‌క్కా ప్ర‌ణాళిక వేసుకుని ముందు కెళ్తుంది.

By:  Tupaki Desk   |   25 March 2024 12:30 AM GMT
రోడ్డుమీద డీజే పాట‌ల‌కి డాన్సు చేసేదాన్ని!
X

అందాల రాశీఖ‌న్నా కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు..త‌మిళం..హిందీ అంటూ అమ్మ‌డు మూడు భాష‌ల్ని దున్నేస్తుంది. ఎక్కువ‌గా హిందీ చిత్రాల‌పై దృష్టి పెట్టి ప‌నిచేస్తుంది. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన అమ్మ‌డు మెయిన్ టార్గెట్ బాలీవుడ్ అంటూ ముందుకు వెళ్తోంది. ముంబై క‌ల్చర్ కి అల‌వాటు ప‌డుతోంది. అక్క‌డ భామ‌ల‌తో ఎలా పోటీ ప‌డాలో? ప‌క్కా ప్ర‌ణాళిక వేసుకుని ముందు కెళ్తుంది.


ఇప్ప‌టికే లుక్ పరంగా శ‌రీరంలో చాలా మార్పులే తెచ్చిన సంగ‌తి తెలిసిందే. చ‌బ్చీ లుక్ నుంచి అమ్మ‌డు పూర్తిగా నాజుగ్గా మారిపోయింది. నార్త్ ఆడియ‌న్స్ కి న‌చ్చే రూపాన్నీ తీసుకొచ్చింది. ఇన్ స్టాలో అమ్మ‌డు పోస్ట్ చేస్తోన్న కొత్త ఫోటోలతో ఆ విష‌యం అర్ద‌మ‌వుతుంది. ఇక సోమ‌వారం హోళీ పండుగ అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నార్త్ లో బాగా ఫేమ‌స్ అయిన హోళీని ఎలా సెల‌బ్రేట్ చేస్తారు? అంటే ఆసక్తిర సంగ‌తులు పంచుక‌కుంది. అవేంటో ఆమె మాటల్లోనే..

`చిన్నప్పుడు హోలీ పండుగ రాగానే బ్యాగ్‌ సర్దుకొని రూర్కీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లిపోయేదాన్ని. కజిన్స్‌ అందరూ వచ్చేవాళ్లు. దాంతో ఇళ్లంతా సందడి సందడిగా ఉండేది. పొద్దున్నే లేచి మేమంతా హోలీ డెకరేషన్‌ పనులు చూసుకునేవాళ్లం. అలాగే కావాల్సిన రంగులన్నీ సిద్ధం చేసేవాళ్లం. మరోవైపు అత్తయ్య మా కోసం రకరకాల వంటలను తయారుచేసి పెట్టేది. రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు చిందులే సేవాళ్లం. అటుగా రొడ్డు మీద‌ వెళ్లే మిగ‌తా డీజేల‌తోనూ మా గ్యాంగ్ క‌లిసిపోయేది.

అలా.. అలిసిపోయేంతవరకూ ఆ రంగుల్లో తడిసి ముద్దయ్యేవాళ్లం. హోలీనాడు పసుపు రంగు దుస్తులు ధరించడానికి ఎక్కువ ఇష్టపడతా. ఆ రంగుంపై ర‌క‌ర‌కాల రంగులు ప‌డుతుంటే ఓ కొత్త రంగు ఉద్భ‌వించిన‌ట్లు ఉంటుంది. అందుకే ఆ రంగు కి మొద‌ట ప్రాధాన్య‌త ఇస్తా. ఇప్పుడు స్నేహితులంతా ఒకే చోట ఉంటే ఆ అల్ల‌రి ఏం త‌గ్గ‌దు. కానీ ఇప్పుడంతా ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీ అయ్యారు` అని అంది.