Begin typing your search above and press return to search.

మృణాల్.. డేటింగ్ సిగ్నల్స్?

దుల్కర్ సల్మాన్ సరసన తన యాక్టింగ్ తో ఒదిగిపోయింది.

By:  Tupaki Desk   |   15 May 2024 6:48 AM GMT
మృణాల్.. డేటింగ్ సిగ్నల్స్?
X

సూపర్ హిట్ మూవీ సీతారామంతో టాలీవుడ్ లో అందాల భామ మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే. తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. క్రేజీ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. దుల్కర్ సల్మాన్ సరసన తన యాక్టింగ్ తో ఒదిగిపోయింది.

ఇక సీతారామం తర్వాత మృణాల్ కు ఆఫర్లు తెగ వచ్చాయి. కానీ ఆమె మాత్రం ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటుంది. గత ఏడాది నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించినా.. యూత్ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ ఎఫెక్ట్ మృణాల్ పై పడలేదని చెప్పాలి. ఎప్పటిలానే తెలుగులో ఈ అమ్మడికి బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి. హను రాఘవపూడి- ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న పీరియాడిక్ డ్రామాలో మృణాల్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కొన్ని అనౌన్స్మెంట్స్ రానున్నాయని టాక్.

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఈ బ్యూటీ ముంబైలోని ఓ రెస్టారెంట్ లో నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో కనిపించింది. రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇద్దరూ హగ్ చేసుకోవడం, స్టెప్స్ దిగుతున్నప్పుడు చేతులు పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారేమోనని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు అంతా వీరిద్దరి కోసమే టాపిక్ నడుస్తోంది.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో సిద్ధాంత్ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మృణాల్ తో సిద్ధాంత్ ఇప్పుడు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యి ఉండొచ్చని కొందరు నెటిజన్లు అంటున్నారు. లేకుంటే ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయనున్నారేమోనని చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్ కోసమే చర్చించుకుని ఉంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.