ఏడేళ్ల పాటూ బాధ అనుభవించిన స్టార్ యాంకర్
బిగ్ బాస్ కు వెళ్లి అంతంతమాత్రం ఫేమ్ ఉన్నోళ్లు కూడా ఆ షోకు వెళ్లొచ్చాక మంచి ఫేమ్ తో దూసుకెళ్తుంటే శిల్ప మాత్రం ఆ షో తర్వాత పెద్దగా సక్సెస్ అవలేకపోయింది.
By: Tupaki Desk | 17 March 2025 7:00 PM ISTయాంకర్ గా టెలివిజన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి ఆ తర్వాత నటిగా మారి పలు సినిమాలు, సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. ఒకనొక టైమ్ లో యాంకర్ సుమతో పోటీగా షోలు చేస్తూ బిజీగా ఉన్న శిల్పా పిల్లలు పుట్టాక కొన్నాళ్ల పాటూ బ్రేక్ తీసుకుంది. మళ్లీ కెరీర్ ను స్టార్ట్ చేద్దామనుకునే టైమ్ కు బిగ్ బాస్3 లో అవకాశం రావడంతో వెళ్లింది.
బిగ్ బాస్ కు వెళ్లి అంతంతమాత్రం ఫేమ్ ఉన్నోళ్లు కూడా ఆ షోకు వెళ్లొచ్చాక మంచి ఫేమ్ తో దూసుకెళ్తుంటే శిల్ప మాత్రం ఆ షో తర్వాత పెద్దగా సక్సెస్ అవలేకపోయింది. అంతేకాదు బిగ్ బాస్ కు వెళ్లొచ్చాక, కరోనా టైమ్ లో తాను ఎంతగానో బాధపడ్డానని, తన డిప్రెషన్ గురించి మాట్లాడుతూ ఆమె తన యూట్యూబ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో శిల్ప మాట్లాడుతూ ఏడుస్తూ ఎంతో ఎమోషనల్ అయింది.
బిగ్ బాస్ తర్వాత చాలా మంది తనను అనవసరంగా ట్రోల్ చేశారని, తనతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, బయటికొచ్చాక పలు ఇంటర్వ్యూలు ఇచ్చి కౌంటర్ ఇచ్చానని, ఆ ఇంటర్వ్యూల కింద కూడా తనను బూతులతో తిట్టేవాళ్లని, అవి అర్థం కాక మా ఆయన్ని అడిగితే ఆ బూతులు చెప్పకూడదన్నారని, అసలు బిగ్ బాస్ కు వెళ్లకుండా ఉండాల్సిందన్నారని శిల్ప తెలిపింది.
ఇంతకుముందు పది వేల ముందు కూడా మాట్లాడే తాను ఆ ట్రోల్స్ తర్వాత మాట్లాడలేకపోయానని, నేను ఏం చేశానని ఇలా తిడుతున్నారనుకున్నానని , వాటి వల్ల తానెంతో డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్తున్న శిల్పా దాన్నుంచి బయటకు రావడానికి నాలుగు నెలల టైమ్ పట్టిందని పేర్కొంది. ఈ ట్రోలింగ్స్ దాదాపు ఏడేళ్ల పాటూ కంటిన్యూ అయ్యాయని శిల్ప చెప్పింది.
దానికి తోడు అదే టైమ్ లో తన తల్లి క్యాన్సర్ బారిన పడటం, తండ్రి చనిపోవడం జరిగాయని, ఈ సంఘటనలన్నీ తనను మనిషిని కానీయలేదని శిల్పా తెలిపింది. అంతేకాదు ఆమె నాలుగేళ్ల కిందట యూట్యూబ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తే దాని ద్వారా కూడా శిల్పా సక్సెస్ కాలేకపోయింది. ఈ నాలుగేళ్లలో ఆమెకు ఇప్పటివరకు కేవలం 10000 మంది సబ్‌స్క్రైబర్లు మాత్రమే వచ్చారు.
తన ఇంట్లో వాళ్లు, చుట్టాలు, తెలిసినవాళ్లు ఏంటి ఇంట్లోనే ఉంటున్నావు నీకు ఛాన్సులు రావట్లేదా లేదంటే పని చేయకూడనంత పెద్ద దానివైపోయావా అని ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసేవారంటూ ఎమోషనల్ గా మాట్లాడింది శిల్ప. మొత్తానికి ఇప్పుడు తాను ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానని చెప్తోన్న ఆమె.. బాధ, సైలెంట్, ఎదురుదెబ్బలు నేర్పిన పాఠాలతో తాను మునుపటి కంటే స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తానని చెప్తోంది. మరి శిల్ప అనుభవించిన కష్టానికి తగ్గ ఫలితం ఇప్పటికైనా దక్కుతుందో లేదో చూడాలి.