Begin typing your search above and press return to search.

పుష్ప 2: శిల్పారవి అగరబత్తి సపోర్ట్.. కాస్త జాగ్రత్త సామీ!

సోషల్ మీడియాలో నెగిటివిటీ ఉన్న కూడా ఈ సినిమాపై పబ్లిక్ లో మాత్రం మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది.

By:  Tupaki Desk   |   21 Nov 2024 6:08 AM GMT
పుష్ప 2: శిల్పారవి అగరబత్తి సపోర్ట్.. కాస్త జాగ్రత్త సామీ!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ పైన ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. మేకర్స్ అయితే అగ్రెసివ్ మోడ్ లో ‘పుష్ప 2’ ప్రమోషన్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా అన్ని ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాని స్ట్రాంగ్ గా జనాల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ బొమ్మగా ‘పుష్ప 2’ మారుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగిటివిటీ ఉన్న కూడా ఈ సినిమాపై పబ్లిక్ లో మాత్రం మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. వీకెండ్ లోనే ఈ సినిమా కచ్చితంగా చూడాలనే ఆసక్తితో ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ‘పుష్ప 2’ మూవీకి, అల్లు అర్జున్ కి వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో విషెస్ చెప్పారు. పుష్పరాజ్ ఇమేజ్ ఉన్న లేస్, అగరబత్తి, అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఫోటోల వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి బన్నీకి అభినందనలు తెలియజేశాడు. అలాగే వైల్డ్ ఫైర్ ని స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

వైసీపీ సపోర్టర్స్ ఈ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 2024 ఎన్నికల టైమ్ లో శిల్పా రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై జనసేన ఫాలోవర్స్- మెగా ఫ్యాన్స్ - టీడీపీ శ్రేణులు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అప్పటి నుంచి ఓ వర్గం వారు పుష్ప 2ని మేము చూడబోము అని సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ కూడా వైరల్ అయ్యేలా చేశారు. అయితే ఇప్పుడు అదంతా అందరూ మర్చిపోయిన తరుణంలో బన్నీ ఫ్రెండ్ శిల్పా రవిచంద్రకిషోర్ ‘పుష్ప 2’ కి విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. దీంతో పాత గాయాన్ని గుర్తు చేసినట్లు అనిపిస్తుంది.

బన్నీ మీద విపరీతమైన నెగిటివిటీ పెరగడానికి పరోక్షంగా శిల్పా రవి ఇన్సిడెంట్ ఒక కారణం అయ్యింది. ఇప్పుడు 'పుష్ప 2' రిలీజ్ వరకు ఆయన కొద్దిగా సైలెంట్ గా ఉంటే బెటర్ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అసలే 1000 కోట్ల టార్గెట్ అంటున్నారు. కాబట్టి అన్ని వర్గాల నుంచి సపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. బన్నీ రవి మధ్య బాండింగ్ మంచిదే కానీ ఈ టైమ్ లో ఇలాంటి సెన్సిటివ్ విషయాలకు వీలైనంత దూరం ఉంటేనే బెటర్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

వివాదాలు కాంట్రవర్సీలు ఎక్కువైతే ఓపెనింగ్స్ పై ఎంతో కొంత ప్రభావం పడకుండా ఉండదు. ఈ వివాదం మళ్ళీ చెలరేగితే పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద ప్రభావం పడవచ్చు. ఇక బన్నీ కూడా అన్ స్టాపబుల్ లో ఎక్కడ పాలిటిక్స్ అనే విషయాన్ని టచ్ చేయలేదు. అలాగే శిల్పారవి కూడా సినిమాలకు అతీతంగా కొంతకాలం ప్రైవసీతో ఆ స్నేహాన్ని కొనసాగిస్తే బెటర్ అనే అభిప్రాయాలు వస్తున్నాయి.

అయితే ఊహించని విధంగా అల్లు అర్జున్, శిల్పారవి విషెస్ కు స్పందించారు. థాంక్యూ బ్రదర్.. మీ ప్రేమకు చాలా థాంక్యూ అంటూ చాలా పాజిటివ్ గా స్పందించిన విధానం కూడా వైరల్ అవుతోంది. అసలు నంద్యాల కాంట్రవర్సీ విషయాన్ని బన్నీ పెద్దగా పట్టించుకోలేదని అనిపిస్తోంది. మరి ఈ కామెంట్స్ కు నెటిజన్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.