ఆ కేసులో బాంబో హైకోర్టుకుకి ఆ జోడీ!
దీనికి సంబంధించి నేడు విచారణ జరుగుతుంది నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఈడీని ఆదేశించింది.
By: Tupaki Desk | 10 Oct 2024 10:18 AM GMTమనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టును ఆశ్రయిం చారు. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఇల్లు, పాప్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ ను ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు పంపింది. దీనికి సంబంధించి నేడు విచారణ జరుగుతుంది. నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఈడీని ఆదేశించింది. గతంలో ఈడీ ఆయా ఆస్తులను అటాచ్ చేసింది.
గత నెల 27న భవనాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ముంబై జోనల్ ఆఫీస్ తాత్కాలికంగా 97 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసింది. ముంబైకి చెందిన ‘వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ 2017లో ‘గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్’ను నిర్వహించింది.
అయితే బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెడితే నెలకు 10శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలయ్యాయి. ఈ మోసం బయట పడటంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ స్కామ్లో మాస్టర్ మైండ్అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్స్‌ను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది.
ఉక్రెయిన్ లో బిట్ కాయిన్ మైనింగ్ ఫామ్ ను ఏర్పాటు చేయాలని రాజ్ కుంద్రా ప్రణాళికలు వేసినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ కాయిన్స్ ఇప్పటికీ ఆయన వద్దనే ఉన్నాయని, మార్కెట్ విలువ 150కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజ్ కుంద్ర ఆస్తులను అటాచ్ చేసింది. అయితే ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.