జీవితంలో వేడి చలి గురించి శిల్పాశెట్టి వేదాంతం
నీలి చిత్రాల యాప్ ల రూపకల్పన, మనీలాండరింగ్ కేసుల్లో కుంద్రా విచారణను ఎదుర్కొంటున్నారు.
By: Tupaki Desk | 23 Dec 2024 3:30 PM GMTసాగర కన్య శిల్పాశెట్టి లైఫ్ ఎమోషన్స్ గురించి అభిమానులకు పరిచయం చేయాల్సిన పని లేదు. వృత్తిగత వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు శిల్పాజీ. ఇటీవల తన భర్త రాజ్ కుంద్రాను ఈడీ మనీలాండరింగ్ కేసులో విచారిస్తోంది. రాజ్ కుంద్రా నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడి చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. నీలి చిత్రాల యాప్ ల రూపకల్పన, మనీలాండరింగ్ కేసుల్లో కుంద్రా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇది శిల్పా శెట్టికి, ఆమె కుటుంబానికి కష్టకాలం.
అయితే జీవితంలో ఇవేవీ శాశ్వతం కాదని, టెంపరరీ మాత్రమేనని శిల్పాశెట్టి సోషల్ మీడియాలో నిర్వేదంగా వ్యాఖ్యానిస్తూ వారం క్రితం ఇన్ స్టాలో ఓ పోస్ట్ ను పెట్టారు. తన భర్తపైనా, తనపైనా వచ్చిన ఆరోపణలను శిల్పాశెట్టి ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. నా భార్యను సంబంధం లేని విషయాలలోకి లాగడం ఆమోదయోగ్యం కాదని రాజ్ కుంద్రా గతంలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగానే శిల్పాశెట్టి తన కుటుంబ జీవితంలో ఎలాంటి కలతను దరి చేరనీయక ఒక చిన్న పిల్ల మాదిరి సమయాన్ని సరదాగా గడుపుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో జరిగే చాలా విషయాలకు ఇది కాంట్రాస్ట్ గా ఉంది. తాజాగా ఐస్ వరల్డ్ లో తడిసి ముద్దవుతున్న ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసారు శిల్పా శెట్టి. మంచు గడ్డల్లో జంప్ చేస్తూ.. అంతలోనే వేడి నీటి పూల్ లో దిగి స్నానమాడుతూ శిల్పా శెట్టి స్కూల్ పిల్లాడిలా అల్లరి చేస్తోంది. ఈ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసిన శిల్పాశెట్టి తనదైన వేదాంత ధోరణితో క్యాప్షన్ ఇచ్చారు. #HotAndColdChallenge పేరుతో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.
''గుండె క్షణకాలం చప్పుడు చేసినంతలోనే జీవితం మిమ్మల్ని హీట్ నుండి చలివైపు విసిరివేయగలదు-ఇలాగే!'' అని క్యాప్షన్ ఇచ్చింది. కానీ ఇది విపరీత పరిస్థితులను స్వీకరించడం .. తిరిగి బలమైన కంబ్యాక్ తో రావడం గురించి మాత్రమే. జీవితంలో సమతుల్యతతో ఉండండి.. ప్రేరణతో ఉండండి.. జీవితం మనకు ఇచ్చే సంసార జీవనంలో మునిగిపోండి.. అని వ్యాఖ్యను జోడించింది. మండే మోటివేషన్, లాప్ లాండ్ డైరీస్.. హాట్ అండ్ కోల్డ్ ఛాలెంజ్ పేరుతో హ్యాష్ ట్యాగుల్ని శిల్పాశెట్టి జోడించింది.