Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌస్ లోకి మహేష్ మరదలు..!

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 18 ఈ ఆదివారం మొదలు కాగా అందులో ఒక కంటెస్టెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు వచ్చింది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 5:30 AM GMT
బిగ్ బాస్ హౌస్ లోకి మహేష్ మరదలు..!
X

బిగ్ బాస్ హౌస్ లోకి మహేష్ మరదలు ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వారిలో మహేష్ మరదలు ఎవరు అని షాక్ అవ్వొచ్చు. ఇక్కడ ప్రస్తావిస్తుంది తెలుగు బిగ్ బాస్ గురించి కాదు హిందీ బిగ్ బాస్ గురించి. హిందీలో సక్సెస్ ఫుల్ గా 17 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఈమధ్యనే 18వ సీజన్ ను మొదలు పెట్టారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ అంటే సల్మాన్ ఖాన్ గుర్తుకు వచ్చేలా చేశాడు సల్మాన్ ఖాన్. షో ని ఎన్నో ఏళ్లుగా తన భుజాన మోస్తున్నాడు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 18 ఈ ఆదివారం మొదలు కాగా అందులో ఒక కంటెస్టెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు వచ్చింది. ఆమె ఎవరో మహేష్ కి సినిమాలో మరదలి పాత్ర చేసిన అమ్మాయి కాదు. నిజంగానే మహేష్ రియల్ లైఫ్ లో మరదలి వరుస ఉన్న అమ్మాయి. ఇంతకీ ఆమె ఎవరు అంటే శిల్పా శోరోద్కర్ అని తెలుస్తుంది. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ సోదరి అయిన శిల్పా 90ల్లో బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

శిల్పా తర్వాతే నమ్రత సినిమాల్లో అడుగు పెట్టింది. ఐతే కెరీర్ లో చాలా గ్యాప్ తర్వాత శిల్పా మళ్లీ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని చూస్తుంది. శిల్పా ఎంట్రీతో బిగ్ బాస్ ఆడియన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. మహేష్ మరదలు శిల్పా హౌస్ లో ఎలాంటి ఆట ఆడుతుంది. మిగతా కంటెస్టెంట్స్ కి ఎలాంటి ఫైట్ ఇస్తుంది అన్నది చూడాలి.

బిగ్ బాస్ హిందీ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. అక్కడ టాస్కులు, కంటెస్టెంట్స్ మధ్య ఫైటింగ్ ఇదంతా ఒక రేంజ్ లో ఉంటుంది. బిగ్ బాస్ హిందీతో పాటు తమిళ్ ఎనిమిదవ సీజన్ కూడా ఈ ఆదివారం నుంచి మొదలైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈ ఆదివారం నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి రాగా వారి ఎంట్రీతో హౌస్ అంతా సందడి సందడిగా ఉంది.