Begin typing your search above and press return to search.

లావుగా ఉందని ఛాన్స్ ఇవ్వ‌లేదా?

చాలా కాలంగా సినిమాలు కూడా చేయ‌క‌పోవ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో కూఆ ఆమె పెద్ద‌గా యాక్టిగా ఉండ‌దు.

By:  Tupaki Desk   |   10 Dec 2024 4:30 PM GMT
లావుగా ఉందని ఛాన్స్ ఇవ్వ‌లేదా?
X

'బిగ్ బాస్ సీజ‌న్' 18తో శిల్పా శిర్కోద్క‌ర్ పేరు ట్రెండింగ్ లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ మ‌ర‌ద‌లిగా శిల్పా శిరోద్క‌ర్ సుప‌రిచిత‌మే. కానీ హిందీ సినిమాల‌తో యాక్టివ్ గా లేక‌పోవ‌డంతో అంతా శిల్పా పేరు మ‌ర్చిపోయారు. స్వ‌యానా న‌మ్ర‌త‌శిరోద్క‌ర్ సిస్ట‌ర్ అయినా? ఆమె హైద‌రాబాద్ రావ‌డం వంటివి కూడా పెద్ద‌గా జ‌ర‌గ‌దు. చాలా కాలంగా సినిమాలు కూడా చేయ‌క‌పోవ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో కూఆ ఆమె పెద్ద‌గా యాక్టిగా ఉండ‌దు.


దీంతో శిల్పా శిరోద్క‌ర్ ని అంతా మ‌ర్చిపోయారు. అయితే సీజ‌న్ 18తో చాలా కాలానాకి ఆమె పేరు తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌త్యేకంగా టాలీవుడ్ మీడియాలో సెంట్రాఫ్ ది అట్రాక్ష‌న్ అయింది. మ‌హేష్ న‌మ్ర‌త‌ని పెళ్లి చేసుకోవ‌డానికి ముందే ఆమె సినిమాల‌కు దూర‌మైంది. మ‌హేష్ పెళ్లి 2005లో అయితే శిల్పా సినిమాల‌కు 2000లోనే దూర‌మైంది. అప్ప‌టి నుంచి ఆమె జాడ మీడియాలోనూ పెద్ద‌గా లేదు.

తాజాగా శిల్పా శిరోద్క‌ర్ కెరీర్ లో ఓ గొప్ప అవ‌కాశాన్ని ఎలా కోల్పోయిందో రివీల్ చేసింది. నిజానికి ఆ పాట‌లో శిల్పా శిరోద్క‌ర్ న‌టించి ఉంటే పాన్ ఇండియాలోనే అప్ప‌ట్లోనే ఓ సంచల‌నం అయ్యేది. ఆ సంగ‌తేంటో ఆమె మాట‌ల్లోనే.. బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్ 'దిల్ సే' చిత్రంలోని 'చ‌య్య చ‌య్యా పాట కోసం ముందుగా న‌న్నే అనుకున్నారు. నా ద‌గ్గ‌ర‌కు ఫ‌రాఖాన్ వ‌చ్చి చూసి కాస్త బ‌రువు త‌గ్గ‌మ‌ని చెప్పింది. వారం ప‌ది రోజుల త‌ర్వాత న‌న్ను ప‌క్క‌న‌బెట్టి ఆ పాట‌కు మ‌లైకా అరోరాను తీసుకున్నారని తెలిసింది.

నేను మ‌రీ లావుగా ఉన్నాన‌ని, ఆపాట‌కు సూట‌వ్వ‌వు అని ఫ‌రా ఖాన్ నాతో చెప్పింది. నిజంగా న‌న్ను తీసేయ‌డానికి లావుగా ఉండ‌ట‌మే కార‌ణ‌మా? లేక మ‌రో కార‌ణ‌మా? అన్న‌ది నాకు డౌట్. ఎందుకంటే న‌న్ను చూసే బ‌రువు త‌గ్గ‌మ‌ని చెప్పిన ఫ‌రాఖాన్ త‌ర్వాత మాట ఎందుకు మార్చిందో తెలియ‌దు. ఆ సంగ‌తి ప‌రాఖాన్..ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం మాత్ర‌మే చెప్పాలి' అని తెలిపింది.