డబ్బు కోసమే బిజినెస్‌మేన్‌ని పెళ్లాడిన నటి?
సౌత్ నార్త్ లో దశాబ్ధంపైగా కథానాయికగా ఏలింది. అటుపై ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది
By: Tupaki Desk | 10 March 2024 2:45 AM GMTసౌత్ నార్త్ లో దశాబ్ధంపైగా కథానాయికగా ఏలింది. అటుపై ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడి లైఫ్ లో సెటిలైంది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి చాలా వ్యాపారాల్లో భాగస్వామి అయింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు.. ఇటీవల తన భర్త అశ్లీల యాప్‌ల కుంభకోణంలో పట్టుబడినప్పుడు తనపై నమ్మకం ఉంచి అండగా నిలవడమే గాకుండా.. ఇప్పుడు తిరిగి తన కెరీర్ ని పునరుద్ధరించుకోవడంలోను సదరు కథానాయిక సఫలమైంది.
అయితే భర్తతో ఆమె ఇంత అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నా కానీ, ఇప్పటికీ అతడిని డబ్బు కోసమే పెళ్లాడిందంటూ ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. ఇదంతా ఎవరిని ఉద్ధేశించి అంటే.. ది గ్రేట్ రాజ్ కుంద్రా- శిల్పాశెట్టి జంట గురించే. డబ్బు కోసమే అతడిని పెళ్లాడింది! అని వ్యంగ్యంగా మాట్లాడే వారికి శిల్పాజీ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో తన స్వయంకృషి, ఆర్థిక విజయాల గురించి కూడా శిల్పా వెల్లడించారు. తమపై చాలా కాలంగా వస్తున్న పుకార్ల గురించి ప్రస్తావించడమే కాకుండా.. కుంద్రా సంపద కోసం అతడిని వివాహం చేసుకున్నట్లు తప్పుగా భావించారని శిల్పా శెట్టి వ్యాఖ్యానించింది. ఈ వాదనలను ఖండించింది. ``మేం కలిసి ఉండాలని దేవుడు కోరుకున్నాడు.. విషయాలు ఫలించాయి`` అని శిల్పాశెట్టి అన్నారు.
అంతేకాదు.. తన భర్త ఆర్థిక విజయాలకు గొప్ప గుర్తింపు దక్కడంతో తాను సాధించిన విజయాలను ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ``అప్పట్లో చాలా ధనవంతురాలైన శిల్పాశెట్టిని జనాలు మర్చిపోయారని, ఈరోజు నేను మరింత ధనవంతురాలిని`` అని సరదాగా వ్యాఖ్యానించారు శిల్పా. పెళ్లి అంటే ఆర్థికంగా అనుకూలత చాలా ముఖ్యం. మనం సక్సెసైనప్పుడు అసురక్షితంగా ఉండని వ్యక్తిని పెళ్లాడాలనుకుంటాం. మన జీవనశైలిని భరించగలిగే వారినే పెళ్లాడాలి`` అని కూడా తన అభిప్రాయం తెలిపారు.
అయితే రాజ్ అంతిమంగా తన హృదయాన్ని గెలుచుకున్నాడని శిల్పా శెట్టి అన్నారు. నేను అతడిని వివాహం చేసుకున్నప్పుడు యాధృచ్ఛికంగా అతడు మంచి స్థానంలో ఉన్నాడు. మేం కలిసి ఉండాలని దేవుడు కోరుకున్నాడు.. విషయాలు ఫలించాయని నేను అనుకుంటున్నాను. కానీ నేను అతడిని వివాహం చేసుకోవడానికి కారణం రాజ్ చాలా మనోహరమైన ప్రేమగలవాడు. నా స్నేహితులందరూ కూడా రాజ్ కి స్నేహితులు అయ్యారు! అని కూడా వ్యాఖ్యానించారు.
శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి కలిసి జీవితాన్ని గొప్పగా నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్ గురించి ప్రస్థావిస్తే.. 48 ఏళ్ల శిల్పాశెట్టి సుఖీలో చివరిగా కనిపించింది. రోహిత్ శెట్టి `ది ఇండియన్ పోలీస్ ఫోర్స్`లో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.