Begin typing your search above and press return to search.

రాజ్‌కుంద్రాను డ‌బ్బు కోసం పెళ్లాడ‌లేదు: శిల్పాశెట్టి

సాగ‌ర‌క‌న్య శిల్పాశెట్టి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాంబే డైయింగ్ య‌జ‌మాని అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడారు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 9:14 AM GMT
రాజ్‌కుంద్రాను డ‌బ్బు కోసం పెళ్లాడ‌లేదు: శిల్పాశెట్టి
X

సాగ‌ర‌క‌న్య శిల్పాశెట్టి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాంబే డైయింగ్ య‌జ‌మాని అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడారు. అత‌డు గొప్ప వ్యాపార ద‌క్ష‌త క‌లిగిన వాడు. ఫోర్బ్స్ క‌థ‌నం ప్ర‌కారం.. కుంద్రా భార‌త‌దేశంలో 108వ అత్యంత ధ‌న‌వంతుడు. అత‌డు ఇటీవ‌ల‌ నీలిచిత్రాల యాప్ ల కేసులో అరెస్ట‌వ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. అనంత‌రం బెయిల్ పై జైలు వెలుప‌లే ఉన్నారు.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో శిల్పాశెట్టి త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. రాజ్‌కుంద్రాను అతడి సంపద కోసం పెళ్లి చేసుకున్నారనే ఆరోపణ‌ల‌పై స్పందిస్తూ.. తన భర్త ధనవంతుడు అయినప్పటికీ సంపాద‌నే త‌మ పెళ్లికి కార‌ణం కానే కాద‌ని శిల్పా శెట్టి అన్నారు. తన ఆర్థిక స్థితి గురించిన అపోహలున్నాయ‌ని పేర్కొన్న శిల్పా శెట్టి తాను కూడా ధ‌న‌వంతురాలినే అని అన్నారు. రాజ్ నేపథ్యం గురించి తనకు తెలుసున‌ని.. అదే స‌మ‌యంలో తాను సాధించిన విజ‌యాల‌ను ప్ర‌జ‌లు విస్మ‌రించార‌ని అన్నారు. తాను కూడా రాజ్ కుంద్రా లానే అప్ప‌టికే ధ‌న‌వంతురాలిని అని కూడా తెలిపారు.

మ‌న‌కు స‌రిప‌డినంత డ‌బ్బు, విజ‌యం ఉన్న‌ప్పుడు మ‌న‌కు సౌక‌ర్య‌మైన వ్య‌క్తి జీవిత భాగ‌స్వామిగా ఉండాల‌ని కోరుకుంటాం. డ‌బ్బు ఉన్న‌ప్పుడు మ‌న‌ జీవనశైలిని భరించగలిగే వ్యక్తిని వివాహం చేసుకోవాలి.. ఎందుకంటే ఇద్ద‌రి మ‌ధ్యా స్వాభిమానం త‌లెత్తే ఛాన్సుంది. తాను రాజ్‌ని పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం అతడు మంచి వ్యక్తి కావడమేనని శిల్పా వివరించింది. సంపద అన్ని వేళ‌లా ముఖ్యం కాదు. అత‌డి వద్ద చాలా డబ్బు ఉన్నా.. మంచి వ్యక్తి కాకపోతే అత‌డిని పెళ్లి చేసుకోలేను``అని శిల్పా శెట్టి అన్నారు.

నేను అతడిని వివాహం చేసుకున్నప్పుడు యాధృచ్ఛికంగా అతడు మంచి స్థానంలో ఉన్నాడు. మేం క‌లిసి ఉండాల‌ని దేవుడు కోరుకున్నాడు.. అది జ‌రిగింది. నేను అతడిని వివాహం చేసుకోవడానికి కారణం అత‌డు చాలా ప్రేమగలవాడు. నా స్నేహితులందరూ రాజ్‌కి స్నేహితులు అయ్యారు.. అని తెలిపారు.

2019లో ఫరా ఖాన్ బ్యాక్ బెంచర్స్ షో ఎపిసోడ్ సమయంలో అనిల్ కపూర్ -శిల్పా అతిథులుగా ఉన్నారు. రాజ్ కుంద్రా ప్రతిపాదనకు `అవును` అని ఎందుకు చెప్పారని శిల్పాను ఫరా ప్రశ్నించారు. శిల్పా సమాధానం చెప్పకముందే అనిల్ కపూర్ ``ఆమెకు డబ్బు కావాలి`` అని చమత్కరించాడు. దీనిపై శిల్పా స్పందించారు. డ‌బ్బు అన్నిటికీ స‌మాధానం కాదు! అని శిల్పా శెట్టి ఖండించారు. శిల్పా - రాజ్‌ 2009లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.