11 ఏళ్లకే సిక్స్ ప్యాక్ ..శిల్పాశెట్టి పెంపకమా? మజాకానా?
అందులో 11 ఏళ్ల తన కుమారుడు వియాన్ కుంద్రా అప్పుడే యాబ్స్ తో షేక్ చేసాడు. సిక్స్ బాడీని ఓ రేంజ్ లో హైలైట్ చేసాడు.
By: Tupaki Desk | 14 May 2024 11:30 AM GMTశిల్పాశెట్టి ఎంత గొప్ప ఫిట్ నెస్ ప్రీక్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. అందులో అమ్మడు స్పెషలిస్ట్. ఇప్పటికీ లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారంటే? కారణం ఫిట్ నెస్ ని కాపాడుకోవడమే. ఉదయాన్నే క్రమం తప్పకుండా జిమ్ చేస్తుంది. వారంలో కొన్ని రోజుల పాటు యోగాసనాలు...ధ్యానం చేస్తుంటుంది. డీటీషన్లు..న్యూట్రిషియన్ల మెనూ నే ఫాలో అవుతుంది. ఇప్పటికీ నవతరం భామలతో పోటీ పడుతుందంటే? కారణం తనలో ఆ బ్యూటీ చెక్కు చెదర కపోవడమే.
ఫిట్ నెస్ వీడియోలు..ఫోటోలతోనే ఇన్ స్టా వేదికగా లక్షల్లో సంపాదిస్తుంది. ఇందులో అమ్మడు స్పెషలిస్ట్ . బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు ఇన్ స్టా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. రకరకాల ఫిట్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ శిల్పాశెట్టి వీడియోలకు ఉన్న డిమాండ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. అందుకే ఇన్ స్టా క్వీన్ గా నీరాజనాలు అందుకుంటుంది. తాజాగా శిల్పా శెట్టి వరుస చూస్తుంటే కుమారుడిని కూడా అమ్మడు ఇన్స్టా కింగ్ గా మార్చేసేలా ఉంది.
అవును అమ్మడి తంతు చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. కుమారుడి కి సంబంధించిన ఓ ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది. అందులో 11 ఏళ్ల తన కుమారుడు వియాన్ కుంద్రా అప్పుడే యాబ్స్ తో షేక్ చేసాడు. సిక్స్ బాడీని ఓ రేంజ్ లో హైలైట్ చేసాడు. చిన్న వయసులోనే తనలో కమిట్ మెంట్ ..డెడికేషన్ అంటే ఎలా ఉంటుందో? సిక్స్ ప్యాక్ తో ప్రూవ్ చేసాడు. పలకలు కలిగిన వియాన్ బాడీ షేప్ మామూలుగా లేదు. బాడీ బిల్డర్ లా చేతులు బింగించి కండలు చూపించాడు.
ఆ ఫోటోని చూసి శిల్పా శెట్టి మురిసిపోతుంది. 11 ఏళ్ల నా కుమారుడు అప్పుడే ఇలా! తనకి నా జీన్స్ వచ్చాయంటూ నవ్వేసింది. మొత్తానికి కుంద్రా ఫ్యామిలీ నుంచి సిక్స్ ప్యాక్ స్టార్ ని11 ఏళ్లకే సిద్దం చేసిందనొచ్చు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వరల్ గా మారింది. తల్లిని మించిన తనయుడు అయపోతాడు? 11 ఏళ్ల వయసులోనే అంత కష్టపడ్డాడు? అంటే అన్నితెలిసిన వయసు వచ్చే సరికి వియాన్ పెద్ద బాడీ బిల్డర్ అయిపోతాడు. మరెమనుకున్నారరు? శిల్పా శెట్టి పెంపకమా? మజాకానా!