క్యాన్సర్ అని అప్పుడే తెలిసింది.. ఎంతో కంగారు పడ్డా: శివన్న
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కు శాండిల్ వుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలనుకునే అభిమానులు ఎంతో మంది ఉంటారు.
By: Tupaki Desk | 26 Feb 2025 9:30 PM GMTకన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కు శాండిల్ వుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలనుకునే అభిమానులు ఎంతో మంది ఉంటారు. రాజ్ కుమార్ ఫ్యామిలీ లోని హీరోగా మంచి ఫేమ్ దక్కించుకున్న ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్న టైమ్ లో సడెన్ గా సినిమాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నారు.
క్యాన్సర్ బారిన పడటంతోనే శివ రాజ్ కుమార్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇప్పుడిప్పుడే క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న ఆయన ప్రస్తుతం విరామం తీసుకుంటున్నారు. మార్చి 3 నుంచి తాను తిరిగి సినిమా షూటింగుల్లో జాయిన్ కానున్నట్టు ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
తనకు క్యాన్సర్ ఉన్నట్టు ఏప్రిల్ లోనే తెలిసిందని, వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైమ్ లో క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపట్టాడని, కానీ రెస్ట్ తీసుకోకుండా షూటింగులతో బిజీగా ఉండటం వల్లే అలా జరిగిందేమో అనుకుని లోకల్ హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టు చెప్పారు. తర్వాత కొన్ని రోజులకు క్యాన్సర్ టెస్ట్ చేయించినట్టు తెలిపారు.
రిపోర్ట్స్ లో క్యాన్సర్ అని బయటపడ్డాక చాలా టెన్షన్ పడ్డాడని చెప్పిన శివన్న, ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్లు ఇచ్చిన ధైర్యం వల్లే ట్రీట్మెంట్ తీసుకున్నానని, కీమో చేయించుకుంటూ కూడా షూటింగ్ లో పాల్గొన్న రోజులున్నాయని తెలిపారు. కానీ కీమో చేయించిన టైమ్ లో బాగా నీరసమొచ్చేదని, 45 మూవీ క్లైమాక్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుందని శివన్న చెప్పారు.
ట్రీట్మెంట్ తర్వాత ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పిన ఆయన ప్రతీరోజూ యోగా చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను డబ్బింగ్ చెప్పి కంప్లీట్ చేయాల్సిన ఓ సినిమా ఉందని, మార్చి 5 నుంచి హైదరాబాద్ వెళ్లి రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు చెప్పారు. ఆర్సీ16లో తన రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందని ఈ సందర్భంగా శివన్న వెల్లడించారు.