Begin typing your search above and press return to search.

'కేడీ ది డెవిల్' - ఎనర్జిటిక్ బీట్ లో శివ శివ..

'శివ శివ' పాట ఆరంభం నుంచి ఆఖరి వరకు ఆధ్యాత్మికత, జానపద గీతస్వరాల అనుసంధానంతో సాగుతుంది.

By:  Tupaki Desk   |   24 Dec 2024 1:32 PM GMT
కేడీ ది డెవిల్ - ఎనర్జిటిక్ బీట్ లో శివ శివ..
X

ధృవ సర్జా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'కేడీ ది డెవిల్' సౌత్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంటోంది. సినిమాలోని ప్రతీ అప్డేట్ కూడా జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఇక లేటెస్ట్ గా విడుదల చేసిన 'శివ శివ' పాటతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కన్నడ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్స్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

విజనరీ డైరెక్టర్ ప్రేమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార సంప్రదాయాలకు సరికొత్త రూపాన్ని తెచ్చేలా తెరకెక్కిన ఈ పాట ప్రేక్షకుల గుండెను తాకుతుంది. 'శివ శివ' పాటను విడుదల చేయడం కోసం తెలుగు, తమిళం, హిందీ భాషల ప్రముఖులను రంగంలోకి దించారు.

తెలుగులో హరీష్ శంకర్, తమిళంలో లోకేష్ కనకరాజ్, హిందీలో అజయ్ దేవగణ్ ఈ పాటను విడుదల చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కన్నడ నేల ఆచార సంప్రదాయాల గొప్పతనాన్ని పంచుతూనే భారతీయ జానపద సంగీతంలో కొత్త భావనను తీసుకొచ్చే ఈ పాట అర్జున్ జన్యా సంగీతంతో రిచ్‌గా రూపొందింది. ఈ పాటలోని డెప్త్, మ్యూజికల్ ఎలిమెంట్స్‌ భారతీయ సాంస్కృతిక పునాది ఎంత బలంగా ఉందో తెలియజేస్తాయి.

గాయకుల ఎంపిక కూడా ఈ పాటకు ప్రత్యేకమైన అనుభవాన్ని చేకూర్చింది. కన్నడలో ప్రేమ్, కైలాష్ కేర్ ఆలపించిన ఈ పాటకు, తెలుగులో విజయ్ ప్రకాష్, తమిళంలో కూడా విజయ్ ప్రకాష్, హిందీలో కైలాష్ కేర్, సలీమా మాస్టర్ గానం అందించారు. ఈ గాత్రకళాకారుల మాధుర్యం పాటను హృదయాలకు మరింత చేరువ చేసింది. ఈ పాటలోని లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

కన్నడలో మంజునాథ్, తెలుగులో చంద్రబోస్, తమిళంలో మదన్ కార్కి, హిందీలో రక్విబ్ ఆలం, మలయాళంలో మన్‌కోంబు గోపాలకృష్ణన్ ఈ పాటకు పదాలను అందించారు. ఈ పాటకు ఆనంద్ ఆడియో లేబుల్ ద్వారా ప్రాచారం కల్పించడం మరో విశేషం. 'శివ శివ' పాట ఆరంభం నుంచి ఆఖరి వరకు ఆధ్యాత్మికత, జానపద గీతస్వరాల అనుసంధానంతో సాగుతుంది.

విలియం డేవిడ్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో కనబడే విజువల్స్ కన్నుల పండుగగా ఉంటాయి. సంగీతం, విజువల్స్, మరియు లిరిక్స్‌ సమన్వయంతో ఈ పాట దేశం నలుమూలల ప్రజల హృదయాలను కదిలించింది. సంప్రదాయ భారతీయ సంగీతానికి సరికొత్త ప్రాముఖ్యత తెచ్చే ఈ పాట, 'కేడీ ది డెవిల్' భారీ అంచనాలను కలిగించింది. ధృవ సర్జా పవర్‌ఫుల్ లుక్స్‌తో పాటను మరింత గ్రాండ్‌గా ఆకట్టుకొనున్నట్లు అర్ధమవుతుంది. మరి సినిమా రిలీజ్ తరువాత ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.