అలీని రాజకీయాలు చేయోద్దంటోన్న శివాజీ
తాజాగా ఓ టాక్ షోలో అలీ- నటుడు శివాజీ మధ్య రాజకీయం అంశం చర్చకొచ్చింది. 'నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా?
By: Tupaki Desk | 14 March 2024 7:49 AM GMTప్రముఖ హాస్య నటుడు అలీ కొంత కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో వైకాపా తరుపున ప్రచారం చేయడంతో పార్టీలో కీలక పదవి బాధ్యతలు ఆయ నకు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగింది. చివరకి ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమించింది. ప్రస్తుతం అలీ పదవిలో కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల నేపథ్యంలో అలీ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం బలంగా సాగుతోంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ఉన్న సాన్నిహిత్యంతో అలీ ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని గట్టిగానే వినిపిస్తుంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలని ప్రయత్నించారు . కానీ సీటు సర్దుబాటు కాకపోవడంతో కుదర్లేదు. ఈ నేపథ్యంలో తాజా ఎలక్షన్ లో అలీకి ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. ఇక అలీ వైకాపా కంటే ముందు వివిధ పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం ఉంది. కొన్నాళ్లు టీడీపీ పార్టీలో కొనసాగారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ అలీకి మంచి స్నేహితుడైనా అలీ మాత్రం ఆ ఆపార్టీకి తొలి నుంచి దూరంగానే ఉన్నారు.
తాజాగా ఓ టాక్ షోలో అలీ- నటుడు శివాజీ మధ్య రాజకీయం అంశం చర్చకొచ్చింది. 'నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా? అని అలీని... శివాజీ ప్రశ్నించారు. దానికి అలీ జవాబు చెప్పకుండా.. అందరూ బాగానే ఉన్నారు కదా... ఇంకేటి విశేషాలు? అంటూ స్కిప్ కొట్టే ప్రయత్నం చేసారు. కానీ శివాజీ మాత్రం తాను అనుకున్నది ముఖం మీదనే చెప్పేసాడు. తను అనుభవాన్ని చెప్పే ప్రయత్నం చేసాడు.
'నేనైతే ఒప్పుకోను. నువ్వు అస్సలు ఎన్నికల్లో నిలబడొద్దు . బాహ్యా ప్రపంచంలో నీకు అనుభవం ఎక్కువ. పాలిటిక్స్ పరంగా గ్రౌండ్ లెవల్లో నాకు అవగాహన ఎక్కువగా ఉంది. పదేళ్ల పాటు సినిమాలకు దూరమ య్యాక ఈ అవగాహన వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లిన వారు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. పెట్టిన డబ్బులు తిరిగి లాక్కొనే సత్తా మనకుండాలి. ఆ తిరిగి తీసుకోవడం కూడా దుర్మార్గంతో కూడుకున్నది. ఆఖరికి ఇసుక.. మట్టి వంటి ప్రకృతి వనరులను కూడా దోచుకోవాలి.
వివిధ పథకాల్లో వచ్చే డబ్బును ప్రజలకు అందకుండా చేయాలి. అలా నువ్వు చేయగలవా? ఒకరికి పెట్టడం మాత్రమే నీకు తెలుసు... నువ్వు ఎవర్నించీ తీసుకోలేవు. అందుకు దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు. నువ్వు ఉన్న పార్టీ కోసం మాత్రం పనిచేయ్. ఇది నా రిక్వెస్ట్. నీ మేలు కోరేవాడ్ని కాబట్టి ఈ మాట చెబుతున్నా' అన్నారు.