Begin typing your search above and press return to search.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో `శివంభ‌జే`

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ కి ఎప్పుడూ ఆద‌ర‌ణ‌కు కొదవేమి ఉండ‌దు. ఇదే జాన‌ర్ కాన్సెప్ట్ తో రూపొందించిన తాజా చిత్రం శివం భ‌జే.

By:  Tupaki Desk   |   13 July 2024 4:03 AM GMT
స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో `శివంభ‌జే`
X

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ కి ఎప్పుడూ ఆద‌ర‌ణ‌కు కొదవేమి ఉండ‌దు. ఇదే జాన‌ర్ కాన్సెప్ట్ తో రూపొందించిన తాజా చిత్రం శివం భ‌జే. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించ‌గా, అప్స‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆగస్టు 1న శివం భజే గ్రాండ్ గా విడుద‌ల కానుంది.

అధునాత‌న సాంకేతిక నైపుణ్యం ఉప‌యోగిస్తూ జానర్ బ్లెండ్ చేసి సినిమా తీయ‌డం ఇటీవ‌ల అరుదు. అయితే కొంద‌రు మాత్రమే ఈ స‌క్సెస్ సూత్రాన్ని ఛేదించగలరు. మహేశ్వర రెడ్డి మూలికి చెందిన‌ గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని విడుద‌ల చేస్తోంది. `శివం భజే` ట్రైలర్ ఇంత‌కుముందు విడుద‌లై ఎంతో ఆక‌ట్టుకుంది.

ఇండ‌స్ట్రీ బెస్ట్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం ప‌ని చేసారు. ఈ మోడ్ర‌న్ డే సస్పెన్స్ థ్రిల్లర్‌లో అశ్విన్ బాబు - దిగంగనా సూర్యవంశీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్‌ను ప్రకటించినప్పటి నుండి భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల కానుంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కానున్నాయి. ఇంకా ప్రమోషన్స్ ప్రారంభం కాలేదు. మొదటి సింగిల్ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ వారాల్లో విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీనా, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనయా సుల్తానా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.