ఫోటో స్టోరి: బీచ్‌ని మరిగించిన శివంగి
ఢిల్లీలోని NIFT నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో పట్టభద్రురాలు అయ్యాక, పాప్ సంచలనంగా మారిన ఖుషాలీ తర్వాత తన ఫ్యాషన్ డిజైనింగ్ అభిరుచిని కొనసాగంచారు. షకీరా, 2 సార్లు గ్రామీ అవార్డ్ విన్నర్ సింగర్ లీన్ రిమ్స్, జెన్నా దేవాన్ టాటమ్, స్పైస్ గర్ల్ మెలానీ సి, కార్మెన్ ఎలక్ట్రా వంటి ప్రముఖులకు డిజైన్స్ ని రూపొందించారు .
By: Tupaki Desk | 14 Oct 2023 4:12 AM GMTపరిశ్రమలోకి ఎందరో నవతరం తారలు దూసుకొస్తున్నారు. ఇందులో నటవారసులు ఉన్నారు. ఇప్పుడు ఇదే కేటగిరీలో పరిశ్రమ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని మరో ధృవతార ఎన్నో కలలు కంటోంది. ప్రఖ్యాత నిర్మాత, T-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ దువా సోదరి ఖుషాలి కుమార్ పరిశ్రమలో ప్రవేశించింది. సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, పంజాబీ చిత్రాలలో తనవంతు ప్రయత్నాలతో మెరుపులు మెరిపిస్తున్న ఈ బ్యూటీ వినోద ప్రపంచంలోకి తనవంతు ప్రయత్నాలను ఆపలేదు.
అయితే సినీపరిశ్రమ వారసులంతా సక్సెస్ సాధించడం అన్నది అంత సులువేమీ కాదు. ప్రస్తుతం కాలంతో పాటే ఖుషాలి పరుగులు పెడుతోంది. అందివచ్చిన అవకాశాల్ని అందుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాల్లోను ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఈ భామ గోవా బీచ్ ని మరిగించిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. గోవాలోని సుందరమైన బీచ్‌లలో ప్రత్యేకంగా మోర్జిమ్‌లో విహారయాత్రను ఆస్వాదిస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. అద్భుతమైన ఎరుపు -తెలుపు బికినీ ధరించి ఖుషాలి కుర్రకారు గుండెల్ని టచ్ చేసింది. ఖుషాలి ఆకట్టుకునే భంగిమలతో మైమరిపించింది. తన బీచ్‌సైడ్ ఫోటోలలో టోన్డ్ ఫిజిక్ మంత్రముగ్దం చేస్తోంది.
ఇదీ ఖుషాలి నేపథ్యం:
ఖుషాలి కుమార్ నటి కం ఫ్యాషన్ డిజైనర్. ఆమె T-సిరీస్ గ్రూప్ స్థాపకుడు - తల్లి సుదేష్ కుమారి దువా దివంగత సంగీత దిగ్గజం గుల్షన్ కుమార్ దువాకు హిందూ పంజాబీలో జన్మించింది. 2015లో బాలీవుడ్ పాటల వీడియో మైను ఇష్క్ దాతో వినోదప్రపంచంలో అడుగుపెట్టింది. అప్పటి నుండి హైవే స్టార్, రాత్ కమల్ హై, మేరే పాపా, ఇక్ యాద్ పురాణి వంటి పాపులర్ సాంగ్స్ లో కనిపించింది.
ఢిల్లీలోని NIFT నుండి ఫ్యాషన్ డిజైనింగ్‌లో పట్టభద్రురాలు అయ్యాక, పాప్ సంచలనంగా మారిన ఖుషాలీ తర్వాత తన ఫ్యాషన్ డిజైనింగ్ అభిరుచిని కొనసాగంచారు. షకీరా, 2 సార్లు గ్రామీ అవార్డ్ విన్నర్ సింగర్ లీన్ రిమ్స్, జెన్నా దేవాన్ టాటమ్, స్పైస్ గర్ల్ మెలానీ సి, కార్మెన్ ఎలక్ట్రా వంటి ప్రముఖులకు డిజైన్స్ ని రూపొందించారు . ఆమె జస్టిన్ బీబర్ మ్యూజిక్ వీడియో వెయిట్ ఫర్ ఎ మినిట్ కోసం కూడా డిజైన్ చేసింది..ఖుషాలి కుమార్ R. మాధవన్ నటించిన `దహి చీని` చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇందులో ఆమె లాయర్ పాత్రను పోషిస్తుంది.
2018లో ఖుషాలి కుమార్ కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో కనిపించింది., వీటిలో జీనా ముష్కిల్ హై యార్ చిత్రం లైఫ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ సెషన్, పైన్‌వుడ్ స్టూడియోస్ UK , 9వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రివ్యూ అయింది. దాదా సాహెబ్ ఫాల్కే ఉత్సవంలో గౌరవప్రదమైన జ్యూరీ ప్రస్తావన అవార్డును గెలుచుకుంది. డ్రక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హిందీ చలనచిత్రం, జీనా ముష్కిల్ హై యార్‌లో తన నటనకు ఖుషాలి కుమార్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.
ఖుషాలి హిందూ పంజాబీ కుటుంబంలో గుల్షన్ కుమార్ .. తల్లి సుదేష్ కుమారి దువాకు జన్మించారు. ఆమెకు భూషణ్ కుమార్ - తులసి కుమార్ అనే ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.