Begin typing your search above and press return to search.

మహా నగరంలో శివాని బోల్డ్ లుక్

ఈ ఫోటోలో శివాని బ్రౌన్ కలర్ డ్రెస్సులో హైహీల్స్ ధరించి న్యూయార్క్ వీధుల మధ్య తన గ్లామర్ ను ప్రదర్శించింది.

By:  Tupaki Desk   |   9 Nov 2024 12:30 AM GMT
మహా నగరంలో శివాని బోల్డ్ లుక్
X

శివాని రాజశేఖర్ తాజాగా అమెరికా మహానగరం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. బోల్డ్ మరియు గ్లామరస్ లుక్ తో ఉన్న ఈ ఫోటోలు ఆమె అభిమానులను అబ్బురపరుస్తున్నాయి. ఈ ఫోటోలో శివాని బ్రౌన్ కలర్ డ్రెస్సులో హైహీల్స్ ధరించి న్యూయార్క్ వీధుల మధ్య తన గ్లామర్ ను ప్రదర్శించింది. ఆమె సింప్లిసిటీ, కాన్ఫిడెన్స్ ఒక ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. "లివింగ్ లెజెండ్" అంటూ తన ఫ్రెండ్‌ని ట్యాగ్ చేసి ఈ ఫోటోలను షేర్ చేసింది శివాని. సాధారణ డ్రెస్సులోనే శివాని తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను ప్రదర్శిస్తూ, స్టైలిష్ లుక్ తో మెరిసిపోయింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శివాని గ్లామర్ కి ఫిదా అవుతూ బ్యూటీ ఇన్ బౌల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శివాని రాజశేఖర్ గతంలో కూడా పలుసార్లు తన గ్లామర్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంది. ఆమె ఫోటోషూట్స్‌లోని స్టైల్, కాన్ఫిడెన్స్ తో యువతకు ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. ఈ ఫోటోలు ఆమెకు వచ్చిన భారీ ఫాలోయింగ్‌కు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రతి ఫోటోలో గ్లామర్ ని ప్రదర్శిస్తూ కూడా తన ప్రొఫెషనల్ లుక్ ని కాపాడుకోవడం ఆమె ప్రత్యేకత. మరికొందరు అభిమానులు శివాని రాజశేఖర్‌ని అందాల బోమ్మ అని అంటున్నారు.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని శివాని ప్రయత్నిస్తుండగా, ఇలాంటి ఫోటోలు ఆమెకు మరింత క్రేజ్ ను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో బిజీగా ఉన్న శివాని మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. అద్బుతం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాని చివరగా గత ఏడాది కోట బోమ్మలి సినిమాలో కనిపించింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.