Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ కుస్తీ పైట్ అత‌డితోనా!

#ఆర్సీ 16 షూటింగ్ ఈ వారం నుంచి దేశ రాజ‌ధాని ఢిల్లీలో మొద‌లవుతున్న‌సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీమ్ స‌ర్వం సిద్దం చేసుకుని రెడీ గా ఉంది.

By:  Tupaki Desk   |   1 March 2025 1:30 PM IST
రామ్ చ‌ర‌ణ్ కుస్తీ పైట్ అత‌డితోనా!
X

#ఆర్సీ 16 షూటింగ్ ఈ వారం నుంచి దేశ రాజ‌ధాని ఢిల్లీలో మొద‌లవుతున్న‌సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీమ్ స‌ర్వం సిద్దం చేసుకుని రెడీ గా ఉంది. ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ పై కుస్తీ స‌న్నివేశాలు చిత్రీ క‌రిస్తార‌ని ఇప్ప‌టికే తేలిపోయింది. ఈ కుస్తీ సీన్స్ కి-ఢిల్లీకి ఉన్న సంబంధం ఏంటి? అన్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. అయితే ఈ కుస్తీలో చ‌ర‌ణ్ తో పోటీగా దిగేది ఏ న‌టుడు అన్న దానిపై ఇంత‌వ‌ర‌కూ సరైన క్లారిటీ రాలేదు.

క్రికెట్ నేప‌థ్యం గ‌ల స‌న్నివేశాల్ని ప్ర‌ధానంగా చ‌ర‌ణ్‌-దివ్యేందుల మ‌ధ్య చిత్రీక‌రించిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. అయితే కుస్తీ సీన్ ప్ర‌త్య‌ర్ధిపై ఇంత‌వ‌ర‌కూ స్ప‌ష్టత లేదు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ తో త‌ల‌ప‌డేది క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్ అని అంటున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఈ పోరాట స‌న్నివేశాలు చిత్రీక‌రించనున్నార‌ని లీకులందుతున్నాయి. అయితే శివ రాజ్ కుమార్ మాత్రం షూట్ చివ‌ర్లో పాల్గొంటార‌ని స‌మాచారం.

అప్ప‌టి వ‌ర‌కూ ఢిల్లీలో వేర్వేరు స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఉంటుందంటున్నారు. ఇటీవ‌లే శివ రాజ్ కుమార్ విదేశాల్లో క్యాన్స‌ర్ శ‌స్త్ర చికిత్స తీసుకుని బెంగుళూరుకి చేరుకున్నారు. ప్ర‌స్తుతం విశ్రాంతి లోఉన్నారు. మ‌రికొన్ని రోజుల పాటు విరామం అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో శివ‌రాజ్ పూర్తిగా కోలుకునే వ‌ర‌కూ సెట్స్ కి రారు. అందుకు ఎన్ని రోజులు ప‌డుతుంది? అన్న దానిపై క్లారిటీ లేదు.

అయితే ఇవే స‌న్నివేశాల‌కు కంటున్యూటీగా కాకినాడ‌లో కూడా కొంత భాగం షూటింగ్ ప్లాన్ చేసారు. ఈ కుస్తీ సీన్స్ అనేవి ప్లాష్ బ్యాక్ లో వ‌స్తాయ‌ని ప్ర‌చారం లో ఉంది. కాకినాడ షూట్ లో మాత్రం జాన్వీ క‌పూర్ కూడా పాల్గొంటుందిట‌. ఢిల్లీ షూట్ ముగించుకున్న అనంత‌రం టీమ్ నేరుగా కాకినాడ‌కు చేరుకుటుంద‌ని వార్త లొస్తున్నాయి. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.