Begin typing your search above and press return to search.

ట్రీట్మెంట్ కు శివన్న.. RC 16 పరిస్థితేంటి?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Dec 2024 11:01 AM GMT
ట్రీట్మెంట్ కు శివన్న.. RC 16 పరిస్థితేంటి?
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రతో ముడిపడిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. టైటిల్ ను పెద్ది అని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఆ రెండు విషయాలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనప్పటికీ.. రీసెంట్ గా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. మైసూరులో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. అందులో హీరో రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన తన అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అది అయ్యాక మళ్లీ సెట్స్ లో అడుగు పెట్టనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ రీస్టార్ట్ కానుంది.

అయితే RC 16 కోసం మేకర్స్ పవర్ ఫుల్ క్యాస్టింగ్ ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే మూడు పాటలు అదిరిపోయేలా కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆయనతోపాటు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు సినిమా కోసం మాట్లాడారు. బుచ్చిబాబు నెరేషన్ విని షాక్ అయ్యానని చెప్పిన ఆయన.. కథ రాసుకునే విధానం సూపర్ గా ఉందని తెలిపారు.

అయితే ఇంకా RC 16 సెట్స్ లో అడుగుపెట్టని ఆయన.. తాజాగా అమెరికా వెళ్లారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివరాజ్ కుమార్.. యూఎస్ లో చికిత్స చేయించుకోనున్నారు. డిసెంబర్ 24వ తేదీన ఆపరేషన్ జరగనుందని సమాచారం. ఎవరూ తన అనారోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా వెళ్లేముందు శివన్న తెలిపారు.

ఇక ట్రీట్మెంట్ తర్వాత నాలుగు వారాల పాటు అక్కడే రెస్ట్ తీసుకోనున్నారట శివరాజ్ కుమార్. ఆ తర్వాత ఇండియా వచ్చి రెస్ట్‌ తీసుకుని చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన లైనప్ లో RC 16తో పాటు రెండు చిత్రాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు RC 16 షూటింగ్ ఆలస్యమవుతుందేమోనని నెటిజన్లు అనుమానపడుతున్నారు.

శివరాజ్ కుమార్.. తిరిగి సెట్స్ లో అడుగుపెట్టడానికి ఫిబ్రవరి అయ్యేలా కనిపిస్తుందని, ఆయన ముందు ఏ సినిమాకు డేట్స్ ఇస్తారోనని మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు ఆయనది రామ్ చరణ్ మూవీలో కీలక పాత్ర అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే RC 16 మూవీ షెడ్యూళ్లలో మార్పులు చేర్పులు తప్పవని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..