Begin typing your search above and press return to search.

తండేల్ 'శివ'.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

అక్కినేని నాగ చైతన్య ‘తండేల్’ సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనేలా ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Aug 2024 6:30 AM GMT
తండేల్ శివ.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు
X

అక్కినేని నాగ చైతన్య ‘తండేల్’ సినిమాలో నెవ్వర్ బిఫోర్ అనేలా ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తుండగా, టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న తండేల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య ‘రాజు’ అనే ఫిషర్‌మెన్ పాత్రను పోషిస్తున్నారు.

ఇదివరకే నాగ చైతన్య తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో అత్యంత కఠినమైన పాత్రలలో ఒకటిగా నిలుస్తుందని, క్యారెక్టర్ కోసం ఆరు నెలల పాటు హోమ్ వర్క్ చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళం యాస, అక్కడి జీవన విధానం వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పాత్రలో పూర్తిగా మమేకం అయ్యానని చెప్పారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. హైదరాబాద్ ఔట్ స్కర్ట్‌లలో ప్రస్తుతం తండేల్ సినిమా కోసం భారీగా శివుడి సెట్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు చందూ మొండేటి మరియు టీమ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక సెట్ లో ఉన్న నిర్మాత బన్నీ వాస్ ఒక ఫొటో కూడా షేర్ చేశారు.

సెట్‌లో కృష్ణవర్ణపు భక్తులతో చుట్టూ అలంకరించిన సన్నివేశం స్పష్టమవుతోంది. తండేల్ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి, ఇక ఈ ఫోటో చూస్తే, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ మరింత గ్రాండ్ గా ఉంటుందని అనిపిస్తోంది. సినిమా విజువల్ గా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా చేయడంలో టీమ్ ఎంత శ్రద్ధ పెట్టిందో ఈ సెట్ రూపకల్పన చూస్తే తెలుస్తోంది.

ఇక సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె క్యారెక్టర్ ఇందులో చాలా ఎమోషనల్ గా ఉంటుందట. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో మ్యూజిక్ కూడా అదిరిపోనుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో కేవలం యాక్షన్ డోస్ మాత్రమే కాకుండా, ఎమోషనల్ ఎలిమెంట్స్, డ్రామా కూడా ఉంటుందని ఇదివరకే దర్శకుడు చెప్పిన విషయాలు ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తున్నాయి.

వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న బన్నీ వాస్ ఈ ప్రాజెక్ట్‌ పై గట్టి నమ్మకంతో ఉన్నారు, ఆయన చెప్పినట్లు ఈసారి మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్ కూడా సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక సెట్స్ కు సంబంధించిన ఫొటోలు కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఫైనల్ గా సినిమాను డిసెంబర్ లో గ్రాండ్ గా విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.