Begin typing your search above and press return to search.

వీడియో: శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ఫ్లెక్సిబుల్ వ‌ర్క‌వుట్

నేటిత‌రంలో యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక ఫిట్ నెస్ ఔత్సాహికులుగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Sep 2024 9:55 AM GMT
వీడియో: శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ఫ్లెక్సిబుల్ వ‌ర్క‌వుట్
X

బాలీవుడ్ లో యువ‌క‌థానాయిక‌లు జాన్వీ క‌పూర్, సారా అలీఖాన్, అన‌న్య పాండే తదిత‌రులు ఎల్ల‌పుడూ ఫిట్ నెస్ కోసం తీసుకునే శ్ర‌ద్ధ ఇత‌ర న‌టీమ‌ణుల‌కు స్ఫూర్తి నింపుతుంది. టాలీవుడ్ లో స‌మంత, శోభిత‌, ర‌కుల్ ఫిట్ నెస్ ఫ్రీకులుగా సుప‌రిచితులు.


నేటిత‌రంలో యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక ఫిట్ నెస్ ఔత్సాహికులుగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. తాజాగా శివాత్మిక సోష‌ల్ మీడియా ప్రొఫైల్ లో షేర్ చేసిన ఒక వీడియో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. శివాత్మిక న‌ట‌న‌లో నిరూపించుకుంటూనే, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలుగా చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. త‌న టోన్డ్ లుక్ తో అంద‌రి దృష్టిని ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. ఇటీవల తన తీవ్రమైన జిమ్ సెషన్ లో శివాత్మిక లెగ్ వర్కౌట్ లు.. పుల్-అప్ లు.. బ‌రువుల‌ను లాగేందుకు శ్ర‌మ‌ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

ఒక తెలుగ‌మ్మాయి ఇంత‌గా ఫిట్ నెస్ కోసం శ్ర‌మించ‌డం త‌న ప‌ట్టుద‌ల సంక‌ల్పాన్ని వెల్ల‌డిస్తోంది. శివాత్మిక‌ టోన్డ్ ఫిజిక్ వెన‌క తీవ్ర‌మైన‌ కృషి దాగి ఉంది. ఫిట్‌నెస్ ప‌రంగా అంకితభావం, అభిరుచి సోష‌ల్ మీడియా పోస్ట్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

శివాత్మిక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆరంగేట్రం ఆనంద్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న దొర‌సాని చిత్రంలో న‌టించింది. కృష్ణ‌వంశీ `రంగ మార్తాండ` చిత్రంలో చివ‌రిగా కనిపించిన శివాత్మిక తన ప్రతిభతోను ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత త‌న ప్రాజెక్టుల గురించిన వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. శివాత్మిక‌ను చూడ‌గానే `జాన‌కి రాముడు`లో నాగార్జున స‌ర‌స‌న న‌టించిన జీవిత‌నే గుర్తుకు వ‌స్తుంది. త‌న‌కు అలాంటి ఒక మంచి అవ‌కాశం రావాల‌ని ఆకాంక్షిద్దాం.