Begin typing your search above and press return to search.

జిమ్ లో కష్టపడుతున్న స్టార్ కిడ్

శివాత్మిక కూడా ఫిజికల్‌ ఫిట్‌నెస్ కోసం రెగ్యులర్‌ గా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:55 AM GMT
జిమ్ లో కష్టపడుతున్న స్టార్ కిడ్
X

టాలీవుడ్‌ స్టార్‌ రాజశేఖర్‌ ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆనంద్ దేవరకొండతో కలిసి దొరసాని సినిమాతో అరంగేట్రం చేసిన శివాత్మిక రాజశేఖర్‌ మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. అయితే టాలీవుడ్‌ లో తెలుగు అమ్మాయిలకు ముఖ్యంగా స్టార్‌ కిడ్స్ కి ఇతరులతో పోల్చితే కాస్త తక్కువ ఆఫర్లు ఉంటాయి. అయినా కూడా శివాత్మిక రాజశేఖర్‌ ఆఫర్లను అందిపుచ్చుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ లో బిజీగా ఉంది. ఇతర హీరోయిన్స్ తో పోటీ పడేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంది.

హీరోయిన్స్ చూడ్డానికి చాలా సుకుమారంగా కనిపిస్తారు. కానీ వారు అలా కనిపించడం కోసం ప్రతి రోజు ఎంతో కష్టపడుతారు. జిమ్‌ లో గంటల తరబడి వర్కౌట్ లు చేస్తూ ఉంటారు. శివాత్మిక కూడా ఫిజికల్‌ ఫిట్‌నెస్ కోసం రెగ్యులర్‌ గా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా ఆమె షేర్ చేస్తూ ఉంటుంది. మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్న శివాత్మిక రాజశేఖర్‌ ఆ తర్వాత చేసిన పలు సినిమాలతో మరింత గుర్తింపును మరియు స్టార్‌డమ్‌ ను సొంతం చేసుకుంది.

తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా సొంత కష్టంతో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న శివాత్మిక ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. హీరోయిన్‌ గా శివాత్మిక భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరియు తండ్రి ఇద్దరూ కూడా స్టార్స్ అయినా కూడా శివాత్మిక చాలా సౌమ్యురాలు అని, తనతోటి వారికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తుందని ఆమెతో వర్క్‌ చేసిన వారు పలువురు చెప్పుకొచ్చారు. శివాత్మిక ప్రస్తుతానికి కెరీర్‌ లో ఓ మంచి ఆఫర్‌ కోసం ఎదురు చూస్తోంది.

తెలుగు తో పాటు తమిళంలో కూడా శివాత్మిక రాజశేఖర్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. నటిగా అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్న శివాత్మిక రాజశేఖర్‌ తాజాగా ఇన్‌స్టా లో ఈ ఫోటోలను షేర్‌ చేసింది. జిమ్‌ లో వర్కౌట్స్ చేస్తూ మధ్య లో ఇలా సెల్ఫీ తీసుకుని షేర్‌ చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో శివాత్మిక షేర్‌ చేసిన ఈ జిమ్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతోంది. గతంలో మాదిరిగానే ఈ ఫోటోకి కూడా చాలా మంది అందమైన శివాత్మిక అంటూ కామెంట్స్ చేస్తూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.