Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్లోజప్ షో అదుర్స్‌

సీనియర్‌ హీరో రాజశేఖర్‌, జీవిత దంపతుల ఇద్దరు కుమార్తెలు శివానీ మరియు శివాత్మికలు హీరోయిన్‌ లుగా ఎంట్రీ ఇచ్చారు

By:  Tupaki Desk   |   4 Oct 2023 3:00 AM GMT
పిక్ టాక్ : క్లోజప్ షో అదుర్స్‌
X

సీనియర్‌ హీరో రాజశేఖర్‌, జీవిత దంపతుల ఇద్దరు కుమార్తెలు శివానీ మరియు శివాత్మికలు హీరోయిన్‌ లుగా ఎంట్రీ ఇచ్చారు. కమర్షియల్‌ హీరోయిన్స్ రేంజ్ లో అందంగా కనిపించేందుకు వీరు రెడీగా ఉన్నా కూడా తెలుగు అమ్మాయిలు అవ్వడం వల్ల ఆఫర్లు ఎక్కువ రావడం లేదు అనేది మీడియా వర్గాల టాక్‌.


పెద్ద హీరోలు, క్రేజీ హీరోలు పట్టించుకోకున్నా కూడా వచ్చిన ప్రతి ఒక్క అవకాశంను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ లో నిలదొక్కుకునేందుకు శివాని మరియు శివాత్మకిలు ప్రయత్నాలు చేస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్‌ హీరోయిన్స్ మాదిరిగా రెగ్యులర్‌ గా వీరు సోషల్‌ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో సందడి చేస్తూ ఉన్నారు.

శివాత్మిక రాజశేఖర్ తాజాగా క్లోజప్‌ లో తన అందాలను చూపిస్తూ కన్నుల విందు చేసింది. ఈమె దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా సినిమాకి క్రేజ్‌ పెంచుకుంటూ వెళ్తుంది. జనాల్లో ఆధరణ పెంచుకుంటూ ఉంది.

స్టార్ కూతురు అవ్వడం వల్లే సౌత్ సినీ ఇండస్ట్రీలో వీరికి ఆశించిన ఆఫర్లు రావడం లేదు. ఇంత అందంగా ఉన్నా కూడా పాపం అందం కి తగ్గ ఆఫర్లు రావడం లేదు అంటూ నెటిజన్స్ మరియు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శివాత్మిక ఈ క్లోజప్ అందాల షో వైరల్‌ అవుతోంది.