Begin typing your search above and press return to search.

కల్కి.. ఏదీ పడితే అది చేయకుండా..

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ నటి శోభన

By:  Tupaki Desk   |   14 July 2024 6:42 AM GMT
కల్కి.. ఏదీ పడితే అది చేయకుండా..
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న సీనియర్ నటి శోభన. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ గా కూడా శోభన ఉన్నారు. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ అయిన శోభన కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేసింది. ఎలాంటి పాత్రకి అయిన కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో వన్నె తీసుకురావడం శోభన ప్రత్యేకత. శోభన అనగానే వెంటనే ఆమె చేసిన క్యారెక్టర్స్ అందరి మదిలోకి వస్తాయి. అంతగా నటిగా ప్రేక్షకులని ప్రభావితం చేసింది.

చాలాకాలంగా ఆమె సినిమాలు దూరంగా ఉంటూ తనకి ఇష్టమైన క్లాసికల్ డాన్స్ లో కెరియర్ కొనసాగిస్తున్నారు. ఎంతోమందికి డాన్స్ పాఠాలు నేర్పుతున్నారు. మాతృభాష మలయాళంలో కూడా ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. తాజాగా ఆమె డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమాలో మరిమం పాత్రలో కనిపించింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏరికోరి ఆ క్యారెక్టర్ కోసం శోభనని ఎంపిక చేసారంట. మరియం పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది.

సినిమాలో ఆమె క్యారెక్టర్ కి మంచి ప్రాధాన్యత ఉంది. మూవీ క్లైమాక్స్ లో మరియం క్యారెక్టర్ చనిపోతుంది. దీంతో కల్కి పార్ట్ 2లో శోభన కనిపించే అవకాశాలు లేవని తెలుస్తోంది. కల్కి మూవీ తర్వాత శోభనకి వరుస అవకాశాలు వస్తున్నాయంట. అయితే నటించడానికి ఆమె ఆసక్తి చూపించడం లేదని సమాచారం. నటన మీద ప్రస్తుతం అంత ఇంటరెస్ట్ లేదని తన దగ్గరకి వచ్చేవారికి చెప్పేస్తుందంట.

ఏదో రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసే ఆలోచన శోభనకి లేదంట. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు అయితేనే ఒకే చెప్పాలని అనుకుంటుందంట. అందుకే అవకాశాలు వస్తున్న కూడా రిజక్ట్ చేస్తుందని తెలుస్తోంది. కొంతమంది నటీమణులు సినిమా లేకపోయిన సైలెంట్ గా ఉంటారు. ప్రాధాన్యత లేని పాత్రలలో నటించి వారిని వారు తగ్గించుకునే ప్రయత్నం చేయరు. అలాంటి వారిలో విజయశాంతి కూడా ఉంటుంది.

ఒకప్పుడు ఆమెని లేడీ సూపర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులు చూసారు. ఆ స్థాయిలో వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ వస్తేనే చేయడానికి విజయశాంతి ఆసక్తి చూపిస్తున్నారు. లేదంటే సున్నితంగా తిరస్కరిస్తున్నారు. అలాగే శోభన కూడా హీరోయిన్ గా ఎన్నో మరుపురాని పాత్రలలో కనిపించారు. సీనియర్ యాక్టర్ అయిన కూడా కథలో ప్రాధాన్యత ఉంటేనే చేయాలని డిసైడ్ అయ్యారంట.