Begin typing your search above and press return to search.

శోభిత టాట్టూ స్ట‌న్నింగ్

ప్ర‌తిభావంతురాలైన న‌టిగా పాన్ ఇండియాలో నిరూపించుకున్న శోభిత ధూళిపాల‌, ఇటీవ‌ల అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 March 2025 9:07 AM IST
శోభిత టాట్టూ స్ట‌న్నింగ్
X

ప్ర‌తిభావంతురాలైన న‌టిగా పాన్ ఇండియాలో నిరూపించుకున్న శోభిత ధూళిపాల‌, ఇటీవ‌ల అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి అనంత‌రం శోభిత నిరంత‌రం వార్తల్లో నిలుస్తోంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత తిరిగి న‌ట‌న‌లోకి వ‌చ్చింది. ఇటీవల ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటోంది. సెట్ నుండి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు అభిమానులను ఎగ్జ‌యిట్ చేస్తున్నాయి.


ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా వివాహం తర్వాత శోభిత‌కు మొద‌టి సినిమా. ఈ కథ శోభిత పాత్ర చుట్టూ తిరుగుతుంది. 35 ఫేమ్ నటుడు విశ్వదేవ్ రాచకొండ ఇందులో ఒక‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. గూఢ‌చారి లాంటి థ్రిల్ల‌ర్ లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న శోభిత‌...ఇంకా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద స్టార్‌డమ్‌ను సాధించలేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లోను తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి విభిన్న పాత్రలను చేపట్టడంపై దృష్టి పెట్టింది.

మ‌రోవైపు శోభిత సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఫోటోషూట్లు షేర్ చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో త‌న లుక్ అంద‌రినీ విప‌రీతంగా ఆక‌ర్షించింది. దీనికి కార‌ణం శోభిత అల్ట్రా స్టైలిష్ అవ‌తార్‌తో పాటు, త‌న చేతుల‌పై డిజైన‌ర్ టాట్టూలు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డ‌మే. విమానాశ్ర‌యం నుంచి వెళుతున్న శోభిత‌తో ఒక అభిమాని సెల్ఫీ దిగారు. ఆ స‌మ‌యంలో శోభిత చేతుల‌పై అంద‌మైన టాటూలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. గాగుల్స్ ధ‌రించి స్మైలీ ఫేస్ తో అభిమాని కోసం శోభిత ఫోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియోని ఫ్యాన్స్ వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.