శోభిత, చైతూ మళ్లీ ఇలా..?
ఆ మధ్య ఏకంగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కథనాలు వచ్చాయి.
By: Tupaki Desk | 31 May 2024 2:20 PM GMTటాలీవుడ్ స్టార్ నటి సమంతతో విడాకుల తర్వాత యంగ్ హీరో నాగ చైతన్య.. తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళతో రిలేషన్ లో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కలిసి కెమెరాలకు చిక్కడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమేనని అంతా ఫిక్స్ అయ్యారు. ఆ మధ్య ఏకంగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కథనాలు వచ్చాయి. కానీ వీటిపై ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు.
కొన్ని రోజుల క్రితం.. తాను ఏ తప్పూ చేయలేదని, అలాంటప్పుడు తనపై వస్తున్న రూమర్లపై ఎందుకు స్పందించాలంటూ శోభిత ప్రశ్నించింది. ఆ తర్వాత వీరిపై పెద్దగా వార్తలు రాలేదు. కానీ ఇటీవల మళ్లీ చైతన్య, శోభిత రిలేషన్ కు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. చైతూ ఇటీవల వెకేషన్ కు వెళ్లి అక్కడ దిగిన పిక్స్ షేర్ చేశారు. వాటికి శోభితనే ఫస్ట్ లైక్ కొట్టింది. దీంతో ఆ విషయం అప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
ఆ తర్వాత శోభిత కూడా సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫోటో దిగి పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరూ కలిసే ట్రిప్ కి వెళ్లారని అంతా తేల్చేశారు. తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి కనిపించారు. శోభితతో నాగచైతన్య కలిసి యూరప్ ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ వైన్ టెస్ట్ పార్టీకి హాజరవ్వగా.. ఇద్దరు కెమెరాకు చిక్కారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నాగ చైతన్య, శోభిత డేటింగ్ లో ఉన్నారనేది మరోసారి రుజువు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సమంతతో విడిపోయిన తర్వాత.. శోభితతో నాగ చైతన్య సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య , శోభితకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శోభితతో రిలేషన్ పై ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వండి అన్నా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. కొన్ని నెలల క్రితం.. లండన్ లోని రెస్టారెంట్ లో కూడా ఇద్దరూ కలిసి కనిపించారు.
ప్రస్తుతం చైతూ తండేల్ మూవీ చేస్తున్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.