Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : క్లోజప్‌ లో అందాల శోభిత

సాధారణంగా తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌ లోనే చిన్న హీరోలతో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడంకు కిందా మీదా పడుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Jun 2024 6:45 AM GMT
పిక్‌ టాక్ : క్లోజప్‌ లో అందాల శోభిత
X

సాధారణంగా తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌ లోనే చిన్న హీరోలతో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడంకు కిందా మీదా పడుతున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల దృష్టిని ఆకర్షిస్తూ పెద్ద సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ శోభిత దూళిపాళ్ల.


ఈ అమ్మడు మోడలింగ్ పై అభిరుచితో నేరుగా ముంబై వెళ్లింది. అక్కడ మెల్ల మెల్లగా కెరీర్‌ ను దారిలో పెట్టుకుంది. హిందీ సినిమాల్లో మరియు షో ల్లో నటించడం ద్వారా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ శోభిత రచ్చ గెలిచి ఇంట కూడా గెలిచింది.


బాలీవుడ్‌ హాట్ ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసి పోకుండా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియో లు షేర్‌ చేసే ముద్దుగుమ్మ శోభిత మరోసారి ఆకట్టుకునే అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి స్కిన్‌ షో చేయకుండా క్లోజప్‌ షాట్స్ ను షేర్‌ చేసింది.


ప్రయాణంలో తీసుకున్న ర్యాండమ్‌ పిక్స్ ను నెట్టింట షేర్‌ చేసిన ఈ అమ్మడికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సాధారణంగా హీరోయిన్స్ గ్లామర్‌ షో పిక్స్‌ షేర్ చేస్తే లేదా స్కిన్‌ షో చేస్తేనే నెటిజన్స్ ఆ ఫోటోలను పట్టించుకుంటారు.

కానీ శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలకు కూడా మంచి రెస్పాన్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న శోభిత ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాల్లోనే కాకుండా ఒక తమిళ సినిమాను కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.