విఘ్నేష్ ఎల్ఐసీకి బిగ్ షాక్..!
అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం మొదలైంది. ఎనిమిదేళ్ల క్రితం ఎల్ఐసీ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నానని మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ ఎస్.ఎస్.కుమారన్ చెప్పారు.
By: Tupaki Desk | 17 Dec 2023 3:56 AM GMTకోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లాస్ట్ ఇయర్ కాతువాకుల రెండు కాదల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలుగా నటించిన ఆ సినిమా కమర్షియల్ గా అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత లేటెస్ట్ గా విగ్నేష్ శివన్ తన నెక్స్ట్ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు.
లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా కృతి శెట్టి ఫీమేల్ లీడ్ గా ఎల్ఐసీ అనే సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం మొదలైంది. ఎనిమిదేళ్ల క్రితం ఎల్ఐసీ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నానని మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ ఎస్.ఎస్.కుమారన్ చెప్పారు. విఘ్నేష్ శివన్ కొత్త సినిమాకు ఎల్ఐసీ అనే టైటిల్ పెట్టారని తెలిసి షాక్ అయ్యాను. తన సొంత బ్యానర్ సుమ పిక్చర్స్ పై 2015 లోనే ఎల్ఐసీ టైటిల్ రిజిస్టర్ చేశా. ఇది తెలిసి కొద్దిరోజుల క్రితం విఘ్నేష్ శివన్ మేనేజర్ తనని సంప్రదించారు. అయితే తను రాసుకున్న కథకు ఆ టైటిల్ పర్ఫెక్ట్ అని అందుకే దాన్ని ఇవ్వడం కుదరదని చెప్పారు. తనని సంప్రదించిన తర్వాత కూడా విఘ్నేష్ శివన్ ఇలా చేస్తాడని అనుకోలేదని అన్నారు. ఈ టైటిల్ పై సర్వహక్కులు తనకే ఉన్నాయని ఇక మీదట ఆ టైటిల్ ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు కుమారన్.
ఒక సినిమాకు అనుకున్న టైటిల్ మరొకరికి వెళ్లడం అనేది చాలా కామన్. అయితే ప్రొడక్షన్ బ్యానర్ లో టైటిల్ రిజిస్టర్ అయ్యాక దాన్ని ఏడాదికి ఒకసారి రెన్యువల్ చేయించాల్సి ఉంటుంది. ఈమధ్య బండ్ల గణేష్ కి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. అతను తన బ్యానర్ లో నిర్మించే సినిమా కోసం దేవర టైటిల్ రిజిస్టర్ చేయించాడు కానీ రెన్యువల్ చేయించడం మర్చిపోయాడు. ఈలోగా ఆ టైటిల్ ని ఎన్.టి.ఆర్ కొరటాల శివ సినిమాకు పెట్టేశారు. మరి విఘ్నేష్ శివన్ ఎల్.ఐ.సీ విషయంలో కూడా ఇదే జరిగిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సినిమా ఓపెనింగ్ అయ్యిందో లేదో ఎల్ఐసీ సినిమాపై అనుకోని విధంగా వివాదం మొదలైంది. టైటిల్ విషయంలో విఘ్నేష్ కుమారన్ తో సంప్రదింపులు జరిపితే సమస్య పెద్దది అవ్వకుండా ఉంటుంది. మరి విఘ్నేష్ శివన్ ఎల్ఐసీ టైటిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.