Begin typing your search above and press return to search.

పుష్ప 2 మేనియా.. క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్ షాక్

క్లైమాక్స్‌లో సుకుమార్ ‘పుష్ప 3’కి లీడ్ ఇచ్చే సీన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్లైమాక్స్‌లో సర్‌ప్రైజింగ్ షాక్ ఉండబోతోందట.

By:  Tupaki Desk   |   30 Oct 2024 10:56 AM GMT
పుష్ప 2 మేనియా.. క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్ షాక్
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. సినిమా విడుదల తేదీ డిసెంబరు 5గా ఫిక్స్ కాగా, ఆ రోజు ఈ సినిమా వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించబోతుందని ఇప్పటికే బలమైన టాక్ వినిపిస్తోంది. సుకుమార్ ఈ సినిమా కోసం చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నారు. ‘పుష్ప 1’ కంటే హై రేంజ్ ల తీసుకెళ్లడానికి కసరత్తు చేస్తున్నారు. సీక్వెల్‌లో కథా కథనాలు, యాక్షన్ సీక్వెన్సులు, అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఇంకా పర్‌ఫెక్ట్‌గా ఉంటాయని సుకుమార్ ఈ మధ్యే వెల్లడించారు.

అయితే, ఈ సినిమాతోనే కథ ఫినిష్ అవ్వదు. ‘పుష్ప’ ప్రయాణం ఇంకా ఉందట. క్లైమాక్స్‌లో సుకుమార్ ‘పుష్ప 3’కి లీడ్ ఇచ్చే సీన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్లైమాక్స్‌లో సర్‌ప్రైజింగ్ షాక్ ఉండబోతోందట. ఈసారి ఓ ప్రముఖ హీరో వాయిస్ వినిపించబోతోందని, ఆ వాయిస్ ద్వారా ‘పుష్ప 3’ కోసం ప్రేక్షకులను మరింత ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ వేసినట్లు సమాచారం.

అప్పట్లో ‘బాహుబలి’ క్లైమాక్స్‌లో ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న ప్రేక్షకుల ఆసక్తిని పీక్స్‌కి తీసుకెళ్లినట్టు, ఇక్కడ కూడా ఆ హీరో ఎవరు? ఎందుకు వచ్చాడు? అనే ప్రశ్నలతో ‘పుష్ప 3’పై హైప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే సుకుమార్ ఈ క్లైమాక్స్ సీన్ కోసం ఒక ప్లాన్ అనుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సన్నివేశం అయితే పూర్తి చేయలేదు. ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

పుష్ప 3కి లీడ్ ఇచ్చే మరో హీరో పాత్రను ఎవరూ పోషిస్తే బాగుంటుందని చిత్రబృందం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.నవంబర్ 4న ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ షూటింగ్ మొదలవుతుంది. ఈ పాటకు 5 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ‘పుష్ప 3’కి లీడ్ ఇస్తున్న క్లైమాక్స్ సీన్లను షూట్ చేయబోతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా పాన్ ఇండియా రేంజ్ లిప్ క్లిక్కయ్యే హీరోనే తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సారి సుకుమార్ యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ అన్నీ కలిపి ప్రేక్షకులకు మరోసారి పుష్ప రేంజ్ హిట్ అందించే పనిలో ఉన్నారు. పుష్ప 2 టీజర్, పోస్టర్లతోనే ప్రేక్షకులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. పుష్ప 3కి ఇదే మాదిరిగా భారీగా అంచనాలు పెంచాలని సుకుమార్ వ్యూహం వేశారు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.