నవంబర్ 1 నుంచి షూటింగ్లు బంద్!
చిత్ర పరిశ్రమను పునర్నిర్మించే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
By: Tupaki Desk | 31 Oct 2024 12:19 PM GMTకోలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. నవంబర్ 1 నుంచి షూటింగ్లు బంద్ చేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తున్నట్లు వెల్లడించింది. చిత్ర పరిశ్రమను పునర్నిర్మించే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సినిమా బడ్జెట్ తో పాటు, నటీనటుల పారితోషికాలు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు నిర్మాతలకు తలకు మించిన భారంగా మారడంతో కొన్ని రకాల పరిమితులు తీసుకురావాలని సంఘం వెల్లడిచింది.
సినిమాలకు సంబంధించి అన్ని రకాల కార్యక్రలాపాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిర్మాతల డిమాండ్లు ఇలా ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాల్ని థియేటర్లో రిలీజ్ చేసిన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలి. చాలా మంది నటులు అడ్వాన్సులు తీసుకుని ముందుగా తీసుకున్న అడ్వాన్స్ లకు న్యాయం చేయకుండా ఇతర షూట్లలో పాల్గొంటున్నారు. టె క్నిషియన్లు సైతం ఇదే ఒరవడిలో ఉన్నారని ఈ విధానం మారాలని డిమాండ్ చేస్తున్నారు.
సినిమాలకు థియేటర్లు దొరక్క నష్టాలొస్తున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలన్న ప్రపోజల్ ఉంది. అలాగే పరిశ్రమకు సంబంధించిన ఇతర విధి విధానలు కూడా అందరూ పాటించాలని, హద్దు మీరితే కఠిన చర్యలుంటాయని, దీనిలో భాగంగా పరిశ్రమను క్రమబద్దీకరణ జరగడం. అయితే ఈ డిమాండ్లను కొన్ని నెలల ముందే వెల్లడించారు.
నవంబర్ నుంచి షూటింగ్ లు బంద్ చేస్తామని అప్పుడే ప్రకటించారు. ఇప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకొ స్తున్నారు. అయితే నిర్మాతల మండలి ఇలా వ్యవహరించడంపై నడిగర్ సంఘం మాత్రం ఏకీభవించడం లేదు. ఈ బంధ్ కి ఎలాంటి మద్దతును ప్రకటించలేదు.