Begin typing your search above and press return to search.

మెగాస్టార్ లేకుండానే 156 షూటింగ్!

అలాగే ఇంకా హీరోయిన్ కూడా ఫైన‌ల్ కాని నేప‌థ్యంలో ఈ షెడ్యూల్ లో ఆమె కూడా క‌నిపించ‌దు. త్వ‌ర‌లోనే చిరంజీవి టీమ్ తో జాయిన్ అవుతార‌ని స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం.

By:  Tupaki Desk   |   29 Nov 2023 9:30 AM GMT
మెగాస్టార్ లేకుండానే 156 షూటింగ్!
X

మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం ఇటీవ‌ల రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మారేడుమిల్లీ అట‌వీప్రాంతంలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. మొద‌టి షెడ్యూల్ నే భారీ అట‌వీ ప్రాంతంలో చేప‌ట్ట‌డంతో షెడ్యూల్ ఎంత కీల‌క‌మైన‌ద‌న్న‌ది అర్ద‌మ‌వుతుంది. ద‌ర్శ‌కుడు స‌హా కీల‌క స‌భ్యులంతా షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. దీంతో చిరంజీవిపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నార‌ని అంతా అనుకుంటున్నారు.

కానీ అక్క‌డ‌లా జ‌ర‌గ‌డం లేదు. మారేడు మిల్లి షూటింగ్ లో చిరంజీవి ఇంకా జాయిన్ కాలేదు. ఆయ‌న లేకుండానే కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే ఇంకా హీరోయిన్ కూడా ఫైన‌ల్ కాని నేప‌థ్యంలో ఈ షెడ్యూల్ లో ఆమె కూడా క‌నిపించ‌దు. త్వ‌ర‌లోనే చిరంజీవి టీమ్ తో జాయిన్ అవుతార‌ని స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. మ‌రి హీరోయిన్ సంగ‌తేంటి? అంటే దాదాపు ఫిక్స్ అయింద‌నే వినిపిస్తుంది.

అనుష్క‌...త‌మ‌న్నా లాంటి సీనియ‌ర్ భామ‌ల్ని ప‌రిశీలించిన అనంత‌రం మేకర్స్ వాళ్లిద్ద‌రికంటే త్రిష వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు లీకులందుతున్నాయి. దాదాపు ఆమె ఖాయ‌మైంద‌ని అంటున్నారు. త్రిష వ‌చ్చే ఏడాది నుంచి షూటింగ్ లో పాల్గొంటుంద‌ని తాజాగా లీకైన స‌మాచారం. ఇదే నిజ‌మైతే `స్టాలిన్` త‌ర్వాత ఈ జోడీని తెర‌పై చూడొచ్చు. ఇద్ద‌రు జంట‌గా న‌టించి చాలా ఏళ్లు అవుతుంది.

త్రిష హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న స‌మ‌యంలో చేసిన చిత్ర‌మది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మెగాస్టార్ చిరంజీవితో న‌టించే ఛాన్స్ రాలేదు. మ‌ళ్లీ ఇంత కాలాని సోషియా ఫాంట‌సీలో ఛాన్స్ అందుకుం టుంద‌న్న‌ది ఆస‌క్తిక‌ర విష‌యం. ఆ జోడీని చూడాల‌ని అభిమానులు అంతే ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి `విశ్వంభ‌ర` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.