Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్.. క్రేజీ కాంబినేషన్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో తన మార్కెట్ పెంచుకోవడంపై దృష్టి పెట్టారు.

By:  Tupaki Desk   |   7 July 2024 11:20 AM GMT
యంగ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్.. క్రేజీ కాంబినేషన్?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో తన మార్కెట్ పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇదిలా ఉంటే హిందీలో వార్ 2 మూవీలో తారక్ నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 తెరకెక్కుతోంది. మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న డ్రాగన్ మూవీ ఆగష్టు లేదా సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుందనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా ఖరారైందనే ప్రచారం నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇలా వరుసగా మూడు పెద్ద ప్రాజెక్ట్స్ స్టార్ దర్శకులతో తారక్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా హాయ్ నాన్న సినిమానితో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కూతురు సెంటిమెంట్ తో వచ్చిన హాయ్ నాన్న సినిమా నానికి సక్సెస్ అందించింది.

అయితే ఈ దర్శకుడు రీసెంట్ గా ఎన్టీఆర్ కి స్టోరీ నేరేట్ చేసాడంట. స్టోరీ నచ్చడంతో తారక్ ఒకే చెప్పాడనే మాట వినిపిస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యిందంనే టాక్ నడుస్తోంది. అయితే ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం లైన్ అప్ చూసుకుంటే మరో మూడేళ్ళ వరకు వేరొక దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ కనిపించడం లేదు.

దేవర తర్వాత వార్ 2, డ్రాగన్ సినిమాలు ఉన్నాయి. వీటి తర్వాత దేవర పార్ట్ 2 కూడా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేయకుండా కొత్త దర్శకుడిగా ఛాన్స్ ఇస్తాడా అంటే ఆలోచించాల్సిందే. అఫీషియల్ గా ఎనౌన్సమెంట్ వచ్చే వరకు ఈ మూవీపై స్పష్టత రాదు. ఒక వేళ శౌర్యువ్ తో మూవీ చేయడానికి ఎన్టీఆర్ ఒకే చెబితే మాత్రం కచ్చితంగా యంగ్ డైరెక్టర్ కి అది పెద్ద బ్రేక్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.