Begin typing your search above and press return to search.

హాయ్ నాన్న హిట్టయినా.. తొందర పడట్లే..

నెక్స్ట్​ సినిమా కోసం అడ్వాన్స్​ ఇచ్చేవాళ్లు ఉన్నా.. వాటికి చాలా దూరంగా ఉంటున్నారట. తనకేం అడ్వాన్సులు వద్దు అంటున్నారట. అందుకు కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు శౌర్యువ్.

By:  Tupaki Desk   |   16 Dec 2023 4:15 PM GMT
హాయ్ నాన్న హిట్టయినా.. తొందర పడట్లే..
X

ఈ ఏడాది తొలి సినిమాతో హిట్ కొట్టేసిన డైరెక్టర్లలో శౌర్యువ్ ఒకరు. రీసెంట్​గా నాని నటించిన హాయ్ నాన్న సినిమాకు దర్శకత్వం వహించిన ఆయన.. ఫస్ట్ మూవీతోనే హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్​పై తండ్రీకూతుర్ల సెంటిమెంట్​ను చక్కగా పండించి ఆయన మంచి మార్కులు కొట్టేశారు. దర్శకుడిగా తనదైన శైలిలో పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శౌర్యువ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఒక దర్శకుడు హిట్ కొట్టారంటే చాలు.. వెంటనే ఆయనకు అడ్వాన్సులు వస్తూనే ఉంటాయి. కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అని సంబంధం ఉండదు. ఏ సినిమా ఎప్పుడు చేసినా పర్లేదు కానీ నిర్మాణ సంస్థలు మాత్రం అడ్వాన్స్​ సొమ్మును ఇచ్చేస్తుంటారు. ఆ అడ్వాన్స్​ తీసుకుని సినిమా ఖరారు చేస్తే చాలని భావిస్తుంటారు. హీరోలు కూడా ఆ డైరెక్టర్​తో నటించేందుకే మొగ్గు చూపుతుంటారు.

కానీ హాయ్​ నాన్నతో కమర్షియల్ హిట్ కొట్టిన డైరెక్టర్​ శౌర్యువ్ మాత్రం అందుకు పూర్తిగా రివర్స్​గా ఉంటున్నారట. ప్రస్తుతం తన తొలి సినిమా అయ్యాక ఖాళీగానే ఉంటున్నారట. నెక్స్ట్​ సినిమా కోసం అడ్వాన్స్​ ఇచ్చేవాళ్లు ఉన్నా.. వాటికి చాలా దూరంగా ఉంటున్నారట. తనకేం అడ్వాన్సులు వద్దు అంటున్నారట. అందుకు కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు శౌర్యువ్.

"నేను ఇంకా ఏ సినిమాకు ఓకే చేయలేదు. అసలు ఒక సినిమా అయిన వెంటనే మరో మూవీ ఒప్పుకోవాలెందుకు? స్టోరీ కుదరాలి కదా. మెయిన్​గా ఆ కథ నాకు నచ్చాలి. నా మనసుకు నచ్చాలి. హాయ్​ నాన్న మూవీ ఇంకా రిలీజై కొద్ది రోజులే అయింది. అస్సలు నాకేం తొందర లేదు. ఫ్యూచర్​లో మంచి సినిమాలు తీద్దామనుకుంటున్నాను. అందుకు స్టోరీతోపాటు అన్నీ కలిసి రావాలి. అప్పుడే అడ్వాన్స్​ తీసుకుని సినిమా చేస్తాను" అని చెప్పారు శౌర్యువ్.

బడ్జెట్ అనేది సినిమా కథపై ఆధారపడి ఉంటుందని శౌర్యువ్ తెలిపారు. కథను ఎలా అయినా చూపించొచ్చు కానీ ఎంత వరకు ఖర్చు పెట్టించాలో అంతే ఖర్చు పెట్టించాలని చెప్పారు. నెక్స్డ్​ సినిమా మోస్తరు బడ్జెట్​తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తన వద్ద చాలా చిన్న కథలు ఉన్నాయని తెలిపారు. మరి ఫస్ట్ మూవీతోనే మెగా ఫోన్​ పట్టిన శౌర్యువ్ కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తారో మరి.